చిత్రం: సోగ్గాడు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, జయచిత్ర, అంజలీదేవి
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 19.12.1975
పల్లవి :
ఏడూ కొండలవాడా వెంకటేశా…
అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
ఏడూ కొండలవాడా వెంకటేశా…
అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
చరణం: 1
నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు
నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు
నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు
నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు
అన్యాయం అన్యాయం అంటే
వెళ్ళి దేవుడితో చెప్పుకో పొమ్మన్నాడు
పో.. పొమ్మన్నాడు
ఏడూ కొండలవాడా వెంకటేశా
అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశా… శ్రీనివాసా
చరణం: 2
చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు
చట్టం ఒప్పుకుని ఇద్దరం కలవలేదు
చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు
చట్టం ఒప్పుకుని ఇద్దరం కలవలేదు
మనిషి చేసింది చట్టము… మాకు జరిగింది ద్రోహము
నువ్వే నిలబెట్టాలి నీతీ న్యాయమూ… లేదా నువ్వే శూన్యము
ఏడూ కొండలవాడా వెంకటేశా…
అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశా… శ్రీనివాసా
చరణం: 3
మాటమీద నిలబడే మనిషినీ
మనసు మార్చుకోను చేతకాని వాడినీ
మాటమీద నిలబడే మనిషినీ
మనసు మార్చుకోను చేతకాని వాడినీ
చేపట్టి విడువలేను ఆడదానిని
నీ మీద ఒట్టు నేనొంటరివాడ్ని… ఒంటరివాడ్ని
ఏడూ కొండలవాడా వెంకటేశా…
అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
******** ********* ********
చిత్రం: సోగ్గాడు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, సుశీల
పల్లవి:
ఉఫ్….
ఒలె ఒలె ఒలె.. ఓలమ్మీ.. ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
ఒరె ఒరె ఒరె.. ఓరయ్యో ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడలేదు
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
ఒలె ఒలె ఓలమ్మీ.. ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
ఒరె ఒరె ఒరె ఓరయ్యో.. ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడలేదు
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
చరణం: 1
ఒంపు వొంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం
ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించేంత సింగారం
ఒంపు వొంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం
ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించేంత సింగారం
నీ ఊపిరిలోనే ఉంది నన్ను ఉడికించేంత వెచ్చదనం.. అయ్యో
నీ ఊపిరిలోనే ఉంది నన్ను ఉడికించేంత వెచ్చదనం
ఆ వెచ్చదనంలో ఉంది ఉడుకును తగ్గించేంత చల్లదనం
ఒలె ఒలె ఓలమ్మీ.. ఉఫ్ అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
చరణం: 2
కొప్పు నున్నగా దువ్వి దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు
ఆ గొబ్బి పూల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను
కొప్పు నున్నగా దువ్వి దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు
ఆ గొబ్బి పూల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను
తిరిగి తిరిగి రేపెట్టి నువ్వు పొలము దున్నుతూ ఉంటావూ
తిరిగి తిరిగి రేపెట్టి నువ్వు పొలము దున్నుతూ ఉంటావూ
అది తలుచుకుంటూ నేనింట్లో రాతిరి ఎప్పుడెప్పుడనివుంటాను
ఒరె ఒరె ఒరె ఓరయ్యో.. ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడలేదు.. మరి
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
చరణం: 3
చెంగు చుట్టగా చుట్టి చేత్తో గంపను పట్టుకు నడిచేవు
ఆ గుట్టుగ ఉన్న అందాలు నువ్వే రట్టు చేసుకుంటున్నావు
పట్టపగలే గుట్టంతా.. అయినా.. నీకూ నాకూ తెలియనిదా
రట్టు గాని కాపురము వెయ్యి పుట్టుకలైనా కోరే వరము
ఒలె ఒలె ఓలమ్మీ.. ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
ఒరె ఒరె ఒరె ఓరయ్యో.. ఉఫ్.. అంటేనే ఉలిక్కిపడలేదు
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
******* ******** ********
చిత్రం: సోగ్గాడు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి :
సోగ్గాడు లేచాడు చూచి చూచి..
నీ దుమ్ము లేపుతాడు అహ
సోగ్గాడు లేచాడు చూచి చూచి..
నీ దుమ్ము లేపుతాడు
పట్టణాని కొచ్చాడు పల్లెటూరి సోగ్గాడు
బిక్కమొహం వేశాడు బొక్క బోర్ల పడ్డాడు డు డు డు డు
సోగ్గాడు అహ లేచాడు యహై..
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
చరణం: 1
మీసాలు దువ్వుతాడు మీది మీది కొస్తాడు
మిడిగుడ్లు వేసుకుని చూస్తాడు పిచ్చోడు
గరిడిసాము చేసినోడు బిరుసైన కండలోడు..
కర్రెత్తినాడంటే ఆగబోడు తిక్కోడు
మీసాలు దువ్వుతాడు మీది మీది కొస్తాడు
మిడిగుడ్లు వేసుకుని చూస్తాడు పిచ్చోడు
గరిడిసాము చేసినోడు బిరుసైన కండలోడు
కర్రెత్తినాడంటే ఆగబోడు తిక్కోడు
లేస్తేనే కుంటోడు మొనగాడు ఏహేయ్ లేస్తేనే కుంటోడు మొనగాడు
పడుకున్న ఏనుగైనా గుర్రమెత్తె అంటాడు డు డు డు డు
సోగ్గాడు అహ లేచాడు..
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
చరణం: 2
కోక మడత చూశాడు రెవిక ముడిని చూశాడు
కొంగుపట్టి పగలంతా గుంజాడు వెర్రోడు
కోక మడత చూశాడు రెవిక ముడిని చూశాడు
కొంగుపట్టి పగలంతా గుంజాడు వెర్రోడు
కోక డాబు తెలిసినోడు రవిక సోకు ఎరిగినోడు
కోక డాబు తెలిసినోడు రవిక సోకు ఎరిగినోడు
ఆకలేస్తే ఎండుగడ్డి తినబోడు గడుసోడు..
మరి గడ్డివాము చాటుకేల పిలిచాడు
మరి గడ్డివాము చాటుకేల పిలిచాడు..
నీకింత గడ్డెట్టి గాటిలో కడతాడు డు డు డు డు
సోగ్గాడు అహ లేచాడు.. అరెరెరె.. చూచి చూచి
నీ దుమ్ము లేపుతాడు
చరణం: 3
మంచి గుంటావన్నాడు మాపు రమ్మన్నాడు తెల్లార్లు జాగారమన్నాడు పిల్లోడు
ఇట్టాగే ప్రతి ఏడు ఎందర్నో పిలుస్తాడు బాగోతం ఆడించి చూస్తాడోయ్ సోగ్గాడు
మంచి గుంటావన్నాడు మాపు రమ్మన్నాడు తెల్లార్లు జాగారమన్నాడు పిల్లోడు
ఇట్టాగే ప్రతి ఏడు ఎందర్నో పిలుస్తాడు బాగోతం ఆడించి చూస్తాడోయ్ సోగ్గాడు
నువ్వు సత్తెభామవని పొగిడాడు..
అబ్బా నువ్వు సత్తెభామవని పొగిడాడు
ఈ జన్మ రాముడు పై జన్మే కిష్ణుడు డు డు డు డు
సోగ్గాడు అహ లేచాడు.. అరెరెరె.. చూచి చూచి
నీ దుమ్ము లేపుతాడు
సోగ్గాడు అహహ లేచాడు.. అహహహ..
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
******** ******** *********
చిత్రం: సోగ్గాడు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి :
అమ్మమ్మ.. చ..చ..చలి.. హుహుహుహుహు…చలి..
చలి వేస్తుంది.. చంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది
చలి వేస్తుంది.. అబ్బ చంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది
రా రా కప్పుకుందాం.. రా రా కప్పుకుందాం
కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
రా రా .. కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
చలి వేస్తుంది చంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది
రా రా కప్పుకుందాం.. రా రా కప్పుకుందాం
కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
చరణం: 1
పాడు చలి ఆగనంటూంది.. ఆ హా హా.. యాడేడో పట్టి పట్టి లాగుతూంది
పాడు చలి ఆగనంటూంది.. ఆ హా హా.. యాడేడో పట్టి పట్టి లాగుతూంది
గట్టిగా ఇంకా గట్టిగా.. అబ్బా.. కట్టగా ఒకటే కట్టగా ఆహా
గట్టిగా ఇంకా గట్టిగా.. కట్టగా ఒకటే కట్టగా
చుట్ట చుట్టుకుందాము.. పట్టు విడవకుందాము
చుట్ట చుట్టుకుందాము.. పట్టు విడవకుందాము
రా.. రారా.. చలి వేస్తుంది.. చంపేస్తుంది.. అబ్బ కొరికేస్తుంది నులిమేస్తుంది
చరణం: 2
నవ్వులాట చాలదంటూంది.. హాహా హా.. పూలబాల గాలిలాగ పట్టుకుంటోంది
నవ్వులాట చాలదంటూంది.. హాహా హా.. పూలబాల గాలిలాగ పట్టుకుంటోంది
పెంచుకో చెలిమి పెంచుకో.. ఆ.. దోచుకో మనసు దోచుకో.. ఆహా
పెంచుకో చెలిమి పెంచుకో.. హా.. దోచుకో మనసు దోచుకో
సిగ్గు తొలగిపోవాలి మనసు గెలుచుకోవాలి.. అబ్బ
సిగ్గు తొలగిపోవాలి మనసు గెలుచుకోవాలి
రా రా.. కప్పుకుందాం రా రా
రా రా కప్పుకుందాం.. కొత్త కొత్త గాధలెన్నో చెప్పుకుందాం
చలి వేస్తుంది.. హయ్.. చంపేస్తుంది.. కొరికేస్తుంది నులిమేస్తుంది
********* ********* *********
చిత్రం: సోగ్గాడు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
అవ్వబువ్వ కావాలంటే … అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ.. ఓ..అబ్బాయీ
అవ్వబువ్వ కావాలంటే … అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ.. ఓ అబ్బాయీ
అయ్యేదాకా…ఆ…
ఆగావంటే…ఆ…
అయ్యేదాక ఆగావంటే … అవ్వైపోతావ్ అమ్మాయీ … అమ్మాయీ…ఈ…
అయ్యేదాక ఆగావంటే .. అవ్వైపోతావ్ అమ్మాయీ … అమ్మాయీ.. ఓ..అమ్మాయీ
లాలాలా… మ్మ్…హు…మ్మ్ హు…
లాలాలా … మ్మ్…హు…మ్మ్ హు…
చరణం: 1
అయ్యో పాపం అత్తకొడుకువని … అడిగినదిస్తానన్నాను..ఆ…
వరసా వావి వుందికదా అని..నేనూ ముద్దే..అడిగాను
అయ్యో పాపం అత్తకొడుకువని … అడిగినదిస్తానన్నాను
అహ్.. వరసా వావి వుందికదా అని..నేనూ ముద్దే..అడిగాను
నాకు ఇద్దామని వుందీ … కాని అడ్డేంవచ్చిందీ
నాకు ఇద్దామని వుందీ …. కాని అడ్డేంవచ్చిందీ
అంతటితో నువ్ ఆగుతావని నమ్మకమేముందీ….
అబ్బాయీ…ఓ…అబ్బాయ్యీ
అయ్యేదాక ఆగావంటే… అవ్వైపోతావ్ అమ్మాయీ
అమ్మాయీ… ఓ… అమ్మాయీ
చరణం: 2
బస్తీకెళ్ళే మరదలుపిల్లా … తిరిగొస్తావా మళ్ళీ ఇలా
ఇంతకన్నా ఎన్నో ఎన్నో … సొగసులు ఎదిగీవస్తాను
బస్తీకెళ్ళే మరదలుపిల్లా … తిరిగొస్తావా మళ్ళీ ఇలా
ఇంతకన్నా ఎన్నో ఎన్నో … సొగసులు ఎదిగీవస్తాను
ముడుపుకట్టుకొని తెస్తావా … మడికట్టుకొని నువ్ వుంటావా
ముడుపుకట్టుకొని తెస్తావా … మడికట్టుకొని నువ్ వుంటావా
ఈలకాచి నక్కలపాలు … కాదని మాటిస్తావా…
అమ్మాయీ.. ఓ.. అమ్మాయీ
అవ్వబువ్వ కావాలంటే .. అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ ఓ..అబ్బాయీ
చరణం: 3
పల్లెటూరి బావకోసం… పట్టాపుచ్చుకొని వస్తాను
పచ్చపచ్చని బ్రతుకే నీకు… పట్టారాసి ఇస్తాను
పల్లెటూరి బావకోసం… పట్టాపుచ్చుకొని వస్తాను
పచ్చపచ్చని బ్రతుకే నీకు… పట్టారాసి ఇస్తాను
సమకానికి నువ్ వస్తావా… కామందుగ నువ్ వుంటావా
సమకానికి నువ్ వస్తావా… కామందుగ నువ్వ్ వుంటావా
సిస్తు లేని కట్టేలేని… సేద్యం చేస్తానంటావా
అబ్బాయీ..ఓ..అబ్బాయీ
అవ్వబువ్వ కావాలంటే…అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ ఓ.. అబ్బాయీ
అయ్యేదాక ఆగావంటే… అవ్వైపోతావ్ అమ్మాయీ
అమ్మాయీ… అ… అమ్మాయీ