Solo Brathuke So Better (2020)

Solo Brathuke So Better (2020)

ఒగ్గేసి పోకే అమృత… లిరిక్స్

చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజిజ్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్‌ఎన్ ప్రసాద్
విడుదల తేది: 2020

Oggesi Poke Amrutha Telugu Song Lyrics In Telugu

బల్బు కనిపెట్టినోడికే… బ్రతుకు సిమ్మసీకటై పోయిందే
సెల్లు ఫోను కంపినోడికే… సిమ్ము కార్డే బ్లాకై పోయిందే
రూటు సూపే గూగులమ్మనే… ఇంటి రూటునే మర్సిపోయిందే
రైటు టైం సెప్పే వాచ్ కే… బ్యాడు టైమే స్టార్టై పోయిందే

అగ్గిపుల్ల నేనే మెల్లగా కాల్చుతుంటే… సొంత కొంపనే ఫుల్లుగా అంటుకున్నాదే
పాస్ట్ లైఫ్ లో నేను చెప్పిన ఎదవ మాటే… బ్రైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే

ఒగ్గేసి పోకే అమృత… నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత… నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత… నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత… నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

5 స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించ… చిన్న పిల్లవు కాదే
ఫెవికాల్ కన్నా గట్టిగ ఫిక్సయ్… చుక్కలు చూపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే… చెయ్యే రావట్లేదే
హుగ్గు చేసుకొని చెప్దామంటే… భగ్గుమంటావన్న భయమే

బండరాయి లాంటి మైండ్ సెట్టు మార్చి…
మనసుతోటి లింకు చేస్తే బాగుపడతవే…
నీ హార్ట్ గేటు తెరిచి… నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది… నాపై లవ్వుందే

ఒగ్గేసి పోకే అమృత… నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత… నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత… నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత… నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

Solo Brathuke So Better Movie Songs Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

హేయ్.. ఇది నేనేనా… లిరిక్స్

చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: రఘురాం
గానం: సిద్ధ్ శ్రీరామ్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్‌ఎన్ ప్రసాద్
విడుదల తేది: 2020

హేయ్.. ఇది నేనేనా..
హేయ్.. ఇది నిజమేనా..
ఆ అద్దంలోన కొత్తగ కనబడుతున్నా..
ఈ సోలో బతుకే నువ్వొచ్చేసాకే..
నన్నే తోస్తోందే…
కడదాకా నీ యెనకే…

ధీమ్ తోమ్ తోమ్
ధీమ్ తోమ్ తోమ్
ధీమ్ ధీమ్ తనన
ధీమ్ తోమ్ తోమ్
గుండెల్లో… మొదలయ్యిందే…
ధీమ్ ధీమ్ తనన
ధీమ్ తోమ్ తోమ్

ధీమ్ తోమ్ తోమ్
ధీమ్ తోమ్ తోమ్
ధీమ్ ధీమ్ తనన
ధీమ్ తోమ్ తోమ్
నన్నిట్టా… చేరిందే…
ధీమ్ ధీమ్ తనన తోమ్

కలిసిందే పిల్లా..
కన్నులకే వెలుగొచ్చేలా..
పలికిందే పిల్లా..
సరికొత్తా సంగీతంలా..
నవ్విందే పిల్లా..
నవరత్నాలే కురిసేలా..
అరె మెరిసిందే పిల్లా..
పున్నమి వెన్నెల సంద్రంలా..

నీలాకాశం
నాకోసం హరివిల్లై మారిందంటా..
ఈ అవకాశం
చేజారిందంటే మళ్ళీ రాదంటా..
అనుమతినిస్తే
నీ పెనివిటినై ఉంటానే నీ జంటా..
ఆలోచిస్తే
ముందెపుడో జరిగిన కథ మనదేనంటా..

హేయ్.. ఇది నేనేనా..
హేయ్.. ఇది నిజమేనా..
ఆ అద్దంలోన కొత్తగ కనబడుతున్నా..
ఈ సోలో బతుకే నువ్వొచ్చేసాకే..
నన్నే తోస్తోందే…
కడదాకా నీ యెనకే…

హేయ్.. ఇది నేనేనా..
హేయ్.. ఇది నిజమేనా..
ఆ అద్దంలోన కొత్తగ కనబడుతున్నా..

మే నెల్లో మంచే పడినట్టు
జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టు గానే లేనట్టూ..
ఓహో.. ఓఓఓ…
వింటర్లో వర్షం పడినట్టు
వింతలు ఎన్నెన్నో జరిగేట్టు
చేసేశావే నీమీదొట్టూ..
ఓహో.. ఓఓఓ…
కచ్చితంగా నాలోనే..
మోగిందేదో సన్నాయి
ఈ విధంగా ముందెప్పుడూ..
లేనే లేదే అమ్మాయీ..

హేయ్.. ఇది నేనేనా..
హేయ్.. ఇది నిజమేనా..
ఆ అద్దంలోన కొత్తగ కనబడుతున్నా..
ఈ సోలో బతుకే నువ్వొచ్చేసాకే..
నన్నే తోస్తోందే…
కడదాకా నీ యెనకే…

హేయ్.. ఇది నేనేనా..
హేయ్.. ఇది నిజమేనా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నో పెళ్లి… దాంతల్లి… లిరిక్స్

చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: తమన్ ఎస్
సాహిత్యం: రఘురాం
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్‌ఎన్ ప్రసాద్
విడుదల తేది: 2020

నో పెళ్లి… దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి…
నో పెళ్లి… దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి…

భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన…
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన…
పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన…
పెళ్లంటే ఫుల్లు రోదనా… ఆ ఆ

మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజి సోదరా…
నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల..
సంసార సాగరం నువ్వీదలేవురా… నట్టేట్ల మునుగుతావురా…

పెళ్లంటే టార్చరేరా… ఫ్రాక్చరేరా…
పంచరేరా… రప్చరేరా… బీ కేర్ఫుల్ సోదరా…

నో పెళ్లి… దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి…
నో పెళ్లి… దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి…

భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన…
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన…
పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన…
పెళ్లంటే ఫుల్లు రోదనా… ఆ ఆ

పెళ్లే వద్దంటే ఎల్లా… ఎందుకీ గోల
యు గాట్ ఆ మేక్ ఇట్ గొనా సీ ఇట్స్ షైన్…
లైఫె ఈ కలర్ఫుల్ అంతే…
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా పండగే
(పండగే… పండగే… పండగే)

నీ ఫ్రీడమే పోయేంతలా… నీ కింగ్డమే కూలి పోవాలా..!
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా…
లైఫ్ ఉండాలి వీకెండ్ లా…ఆ

నీకున్న స్పేసుని… నీకున్న పేస్ ని
నీ కున్న పీస్ ని… డిస్టర్బ్ చేసుకోకు…

ఎడారి దారిలో… ఒయాసిస్ వేటకై…
ప్రయాణమెంచుకోకు…

పెళ్లంటే కాటు వేసే నాగు పాము…
నువ్వు గెలవలేని గేము…
బీ కేర్ఫుల్ సోదరా…

నో పెళ్లి… దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి…
నో పెళ్లి… దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Kondapalli Raja (1993)
error: Content is protected !!