Sowbhagya Lakshmi Ravamma Telugu Song Lyrics

సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… లిరిక్స్

సంగీతం: —–
సాహిత్యం: —–
గానం: నాగవేణి
నిర్మాణం: —–

Sowbhagya Lakshmi Ravamma Telugu Song Lyrics

సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… ||2||

నుదుట కుంకుమ రవిబింబముగా..
కన్నుల నిండుగా.. కాటుక వెలుగా.. ||2||
కాంచన హారము.. గళమున మెరియగా..
పీతాంబరముల శోభలు నిండగా..

సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా…

నిండుగ కరముల… బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు ||2||
గల గల గలమని.. సవ్వడి చేయగా..
సౌభాగ్య వతుల.. సేవలు నందగా..

సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా…

కుంకుమ శోభిత పంకజలోచని.. వెంకటరమణుని పట్టపురాణి.. ||2||
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే.. పుణ్యమూర్తి మాయింట వెలసిన
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా…

సౌభాగ్యమ్ముల బంగరుతల్లి.. పురందర విఠలుని పట్టపురాణి.. ||2||
ప్రతినిత్యంబులు పూజలందుకొన.. సర్వ కాలములు శుభఘడియలుగా..
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా… అమ్మా… ఆఆ ఆ
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా…

Varalakshmi Devi Aarti Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Show Comments (1)

Your email address will not be published.