SR Kalyanamandapam (2020)

చుక్కల చున్నీకే.. నా గుండెను కట్టావే… లిరిక్స్

చిత్రం: ఎస్. ఆర్. కల్యాణమండపం (2020)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్
దర్శకత్వం: శ్రీధర్ గాదే
నిర్మాణం: ప్రమోద్, రాజు
విడుదల తేది: 2020

Chukkala Chunni Song Telugu Lyrics

తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో తొవ్ తో…

హే చుక్కల చున్నీకే… నా గుండెను కట్టావే
ఆ నీలాకాశంలో… గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టీకే… నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా… అరె..! గళ్ళు గళ్ళు మోగించావే
వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో… ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా

కొత్త కొత్త చిత్రాలన్నీ… ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను… డప్పే కొట్టి చెప్పాలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే… పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు… నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు… కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా

ఓ ఎడారిలా ఉండే నాలో… సింధూ నదై పొంగావే
ఉండిపో ఉండిపో… ఉండిపో ఎప్పుడూ నాతోనే

హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా

బాధనే భరించడం… అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని… ఏంటో అంతా అంటుంటారు
వాళ్లకి తెలుసో లేదో… హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా… అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు… ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా… మనసేనాడు ఊగలేదు

హే దాయి దాయి అంటూ ఉంటే… చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో… ఉండిపో తోడుగా నాతోనే

హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా

SR Kalyanamandapam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

చూసాలే కళ్లారా… లిరిక్స్

చిత్రం: ఎస్. ఆర్. కల్యాణమండపం (2020)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: క్రిష్ణ కాంత్
గానం: సిద్ శ్రీ రామ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్
దర్శకత్వం: శ్రీధర్ గాదే
నిర్మాణం: ప్రమోద్, రాజు
విడుదల తేది: 2020

ఈ నేల తడబడే… వరాల వరవడే
ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా

ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా…

చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ తొలకరి చూపే… నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా

నా శత్రు వీ నడుమే… చంపదా తరిమే
నా చేతులే తడిమే… గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే

చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక మారే
నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా

హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే

హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా ఈనాడే

తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా…
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియా పిలిచేనా…

చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక మారే
నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****