Sravanthi (1985)

చిత్రం: స్రవంతి (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం:  ఎస్.పి. బాలు,  సుశీల
నటీనటులు: శరత్ బాబు, సుహాసిని మణిరత్నం, అరుణ ముచ్చర్ల, మోహన్
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాతలు: కె.కేశవరావు, జయకృష్ణ
విడుదల తేది: 16.01.1985

పల్లవి:
మౌనం ఆలాపన.. మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం..కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో… కావ్యమై మిగిలిపో
తొలి రేయి నీడలో… హో

మౌనం ఆలాపన… మధురం ఆరాధన

చరణం: 1
కలలే నిజమై.. పది కాలాల బంధాలు ముందుంచగా…
యుగమే క్షణమై.. అనురాగాల హరివిల్లు అందించగా…

దివిలో మెరిసే ఆ నక్షత్ర నాదాలు వినిపించగా
మధుమాసానికి పూల ఉగాది..  శతమానానికి ప్రేమే నాంది
హే వసంతాలు సొంతాలుగా చేసుకో….
మందహాసాల మందార పూదోటలో…
ఆ…ఆ…ఆ..

మౌనం ఆలాపన… మధురం ఆరాధన

చరణం: 2
ఇహమో పరమో తీపి కన్నీటి కెరటాలు పొంగించగా
శుభమో సుఖమో… తేనె వెన్నెల్లో తెల్లారి పోతుండగా
ఒరిగే తులసీ మౌన గంధాల గానాలు వినిపించగా

కనివిని ఎరుగని సంగమ వేళ.. గుప్పెడు మనసుల ఆశల హేల
లేత చిరునవ్వునే పాపగా పెంచుకో ….
రాలు కుసుమాల రాగాలనే తెలుసుకో…
ఆ..ఆ…ఆ..

మౌనం ఆలాపన… మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం… కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో… కావ్యమై మిగిలిపో…
తొలి రేయి నీడలో…
మౌనం ఆలాపన…మధురం ఆరాధన

*****   *****  ******

చిత్రం: స్రవంతి (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు

పల్లవి:
నవ్వుతూ వెళ్ళిపో … నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో… తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా … వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా

నవ్వుతూ వెళ్ళిపో … నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో… తావిలా మిగిలిపో

చరణం: 1
మురిపించే చిరునవ్వే పసిపాపలలో అందమూ…
పకపకలాడే పాపల నవ్వే బాపూజీకి రూపమూ…

పగనైన ప్రేమించు ఆ నవ్వులు
శిలనైన కరిగించు ఆ నవ్వులు
వేకువలో కాంతిలా… వేదనలో శాంతిలా…
చిరకాలం నవ్వాలి స్వాతిలా.. ఆరని జ్యోతిలా..

నవ్వుతూ వెళ్ళిపో …నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో…తావిలా మిగిలిపో

చరణం: 2
ఉదయించే తూరుపులో కిరణాలన్ని నవ్వులే…
వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే…

మృతినైన గెలిచేటి ఈ నవ్వులు.. నీ పేర మిగిలేటి నీ గురుతులు
నవ్వులతో సంతకం… చేసిన నా జీవితం…
అంకితమే చేస్తున్నా కవితలా… తీరనీ మమతలా…

నవ్వుతూ వెళ్ళిపో … నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో… తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా … వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా

error: Content is protected !!