చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: ఆర్పీ పట్నాయక్, కులశేఖర్
గానం: బోంబే జయశ్రీ
నటీనటులు: ఉదయ్ కిరణ్, అనిత
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: బురుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 21.06.2002
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను
నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను
చూస్తూ నీ కళ్ళలో
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
తందారె నరె నరె నరె నరె నారే
తందారె నరె నరె నారే
తందారె నరె నరె నరె నరె నారే
తందారె నరె నరె నారే
చల చల్లని మంచుకు అర్ధమే కాదు
ప్రేమ చలవేమిటో
నును వెచ్చని మంటలు ఎరగవేనాడు
ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు
ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు
ఈడు బాధేమిటొ
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
మురిపెంతో సరసం తీర్చమంటోంది
ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది
తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది
ఆవిరై గాలిలో
కలిసుండే కాలం నిలిచిపోతుంది
ప్రేమ సంకెళ్లలో
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో