చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: చిత్ర
నటీనటులు: శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్, రమ్యకృష్ణ
దర్శకత్వం: విజయేంద్రప్రసాద్
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 26.05.2006
నగుమోము కనులారా కననీరా నరుడా
వగమాలి విన్నపాలు వినిపోరా మగడా
ఐ యామ్ సారీ సో సారీ అన్నానుగా
ఇంకేం చేయాలో చెప్పి చావొచ్చుగా
ఈ ఒక సారి మన్నించమన్నానుగా
నగుమోము కనులారా కననీరా నరుడా
ఎంతగా ఎంత ఘాటుగా నిను వలచనో తెలుసా
ఆ ఇంతకు నా అంత మేని నీ చెంత చేరానని అలుసా
మానసేమో మందారం మనిషంతా బంగారం
అనుకున్నా కాని ఇంతలో ఏంటమ్మా గ్రహాచారం
తనలో దాగిన కక్ష వేస్తోందా ఈ శిక్షా
లేకుంటే నా ప్రేమకిది పరీక్షా…
నగుమోము కనగోరి నే చేసేలే తపసు
ఎదలోనే పడు బాధ అది నీకేం తెలుసు
నువ్వచ్చంగా నాతోనే ఉండాలని
నా తనువంత నీతోనే పండాలని
ఈ కథ మంచిగా కంచి చేరాలని