చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, పి. సుశీల
నటీనటులు: యన్ టీ ఆర్ , శోభన్ బాబు, యస్. వరలక్ష్మి
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 13.01.1966
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవానిజేరి
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవానిజేరి
నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె స్వామి
నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె స్వామి
ఏమీ ఎరగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు
మనసుదీర పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవానిజేరి
ప్రేమలు తెలిసిన దేవుడవని విని _నా మదిలోన కొలిచితిని
స్వామివి నీవని తలచి నీకే బ్రతుకే కానుకజేసితిని
నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె స్వామి
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓభామా!
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవానిజేరి
************ ************ ***********
చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి. లీల, పి. సుశీల
స్వాగతం… స్వాగతం సు స్వాగతం
స్వాగతం కురుసార్వభౌమ స్వాగతం సు స్వాగతం
శత సోదర సంసేవిత సదనా అభిమానధనా సుయోధనా
స్వాగతం సు స్వాగతం
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే
రాగభోగ సుర రాజువు నీవే
రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సు స్వాగతం
తలపులన్ని పన్నీటి జల్లులై
వలపులన్ని విరజాజిమల్లెలై
నిన్ను మేము సేవించుటన్నది
ఎన్ని జన్మముల పున్నెమో అది
కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు శౌర్యా భరణా
స్వాగతం సు స్వాగతం
************ ************ ***********
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: జిక్కీ
చాంగురే…చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే….
అయ్యారే….నీకే మనసియ్యలని వుందిరా
చాంగురే…చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే…చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా…
చాంగురే…చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
గుబులుకొనే కోడెవయసు
లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురాకై దండలేక నిలువలేనురా
చాంగురే…చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా