చిత్రం: శ్రీకృష్ణ సత్య (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం:
గానం: యస్. జానకి, ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, జమున
దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి
నిర్మాత: యన్. త్రివిక్రమ రావు
విడుదల తేది: 01.01.1971
అలుక మానవే చిలకల కొలికిరొ
తలుపు తీయవే ప్రాణసఖి
తలుపు తీయవే ప్రాణసఖి
దారితప్పి ఇటు చేరితివా
నీ దారి చూసుకోవోయి నా దరికి రాకోయి
కూరిమి కలిగిన తరుణివి నీవని
తరుణము ఎరిగియే చేరితినే
కూరిమి కలిగిన తరుణివి నీవని
తరుణము ఎరిగియే చేరితినే
నీ నెరి నెరి వలపు కోరితినే
నీ నెరి నెరి వలపు వేడితినే
అలుక మానవే చిలకల కొలికిరొ
తలుపు తీయవే ప్రాణసఖి
తలుపు తీయవే ప్రాణసఖి
చేసిన బాసలు చెల్లించని ఓ మోసగాడివి ఓయి
ఇక ఆశ లేదు లేదోయి
చేసిన బాసలు చెల్లించని ఓ మోసగాడివి ఓయి
ఇక ఆశ లేదు లేదోయి ఇక ఆశలేదు పొవోయి
దాసుని నేరము దండముతో సరి
బుసలు మాను ఓ ఒగలాడి
దాసుని నేరము దండముతో సరి
బుసలు మాని ఓ ఒగలాడి
నా సరసకు రావే సరసాంగి
నా సరసకు రావే లలితాంగి
అలుక మానవే చిలకల కొలికిరొ
తలుపు తీయవే ప్రాణసఖి
తలుపు తీయవే ప్రాణసఖి