Sri Krishna Tulabharam (1966)

sri krishna tulabharam 1966

చిత్రం: శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: స్థానం నరసింహారావు
గానం: పి. సుశీల
నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.08.1966

పల్లవి:
మీరజాలగలడా…
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 1
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 2
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 3
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..
ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా…

*****  ******  ******

చిత్రం:  శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం:  పెండ్యాల
సాహిత్యం:  దాశరథి
గానం:  పి. సుశీల, ఎస్.జానకి

పల్లవి:
కరుణించవే తులసిమాత..
కరుణించవే తులసిమాత..
దీవించవే దేవీ మనసారా..
కరుణించవే తులసిమాత..

చరణం: 1
నిన్నే కోరి పూజించిన సతికీ… కలుగుకాదే సౌభాగ్యములన్ని
నిన్నే కోరి పూజించిన సతికీ… కలుగుకాదే సౌభాగ్యములూ

కరుణించవే తులసిమాత.. కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా… కరుణించవే….దీవించవే..
పాలించవే.. తులసిమాత

చరణం: 2
వేలుపురాణి….వాడని వయసు… వైభవమంతా నీ మహిమేగా…
ఆ……ఆ….ఆ…ఆ….ఆ…ఆ
ఆ……ఆ….ఆ…ఆ….ఆ…ఆ
వేలుపురాణి…. వాడని వయసు… వైభవమంతా నీ మహిమేగా…
అతివలలోనా అతిశయమందే… భోగమందీయ్యవే..

కరుణించవే కల్పవల్లీ…
కరుణించవే కల్పవల్లీ…దీవించవే తల్లీ … మనసారా
కరుణించవే…. దీవించవే… పాలించవే… కల్పవల్లీ

చరణం: 3
నిదురనైనా నా నాధుని సేవా.. చెదరనీక కాపాడగదే
ఆ…ఆ…ఆ…ఆ.ఆ.ఆ.ఆ
ఆ…ఆ…ఆ…ఆ.ఆ.ఆ.ఆ
నిదురనైనా నా నాధుని సేవా… చెదరనీక కాపాడగదే

కలలనైనా గోపాలుడు నన్నే… వలచురీతి దీవించగదే….
కలలనైనా గోపాలుడు నన్నే… వలచురీతి దీవించగదే

కరుణించవే కల్పవల్లీ… కరుణించవే తూలసిమాత
దీవించవే తల్లీ మనసారా..
కరుణించవే… దీవించవే…
పాలించవే…. తులసిమాత

*****  ******  ******

చిత్రం: శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి:
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

ఓ చెలి! కోపమా అంతలో తాపమా

చరణం: 1
అందాలు చిందేమోము కందేను ఆవేదనలో
పన్నీట తేలించెదనే మన్నించవే

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

చరణం: 2
ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల?
దరిచేరి అలరించెదనే దయచూపవే…

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

చరణం: 3
ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే
తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే

నను భవదీయ దాసుని మనంబున
నియ్యపుకింకబూని కాచిన అది నాకు మన్ననయ
చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుకులకాగ్ర
కంఠక విథానముతాకిన నొచ్చునన్చు నేననియదా
అల్క మానవుగదా ఇకనైన అరాళకుంతలా…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top