Sri Krishnarjuna Yuddhamu (1963)

sri krishnarjuna yuddhamu 1963

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: యస్. వరలక్ష్మి
నటీనటులు: యన్. టి.రామారావు, నాగేశ్వరరావు, బి.సరోజాదేవి
దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి)
నిర్మాత: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి)
విడుదల తేది: 09.01.1963

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే

వాసుదేవుని చెల్లెలా నా ఆశయే ఫలియించెలే
వాసుదేవుని చెల్లెలా నా ఆశయే ఫలియించెలే
దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెనే

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే

భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవులే
భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవులే
ధీరవీరకుమారునితో మరల వత్తువుగానిలే

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే

********   ********   *********

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: బి.గోపాలం, స్వర్ణలత

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ
అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ

అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా
స్వామీ స్వామీ ఏమీ ఏమీ
నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనే
అకట మీపై విసిరినే అందుకే మరి

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ

కనులు మూసుకు చూపులు ముక్కుపై నిలుపుమా
స్వామీ స్వామీఈ మారేమీ
అచట నిలువక చుపులన్నీ అయ్యో మీపై దూకెనే
అయ్యో మీపై దూకెనే అదే మరి

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ

********   ********   *********

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: పి. సుశీల

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా
స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా
ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా
ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా

ఎన్ని తీర్థములు సేవించారో ఎన్ని మహిమలను గడియించారో
విజయం చేసిరి మహానుభావులు మన జీవితములు తరించుగా

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా
ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా

లీలాశుకులు ఋష్యశృంగులు మన యతీంద్రులై వెలసిరిగా
ఏమి పూజలో ఏమి ధ్యానమో మన లోకములో ఉండరుగా

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా
ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా

ఏయే వేళలకేమి ప్రియములో ఆ వేళలకవి జరుపవలె
సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలె

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా
ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా

********   ********   *********

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే
అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే

కుడి కన్నదిరే కుడి భుజమదిరే
కోరిన చెలి నను తలచెనులే
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే

మల్లెతోరణల మంటపమందె
కనులు మనసులు కలియునులె
కలసిన మనసులు కలరవములతో
జీవితమంతా వసంతగానమౌనులే

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే

********   ********   *********

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: ఘంటసాల

తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా
తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా
ఎదుట నిలువుమని మంత్రము వేసి
చెదరగనేల జవరాలా
తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా

తెలిమబ్బులలో జాబిలి వలెనే
మేలిముసుగులో దాగెదవేల
మేలిముసుగులో దాగెదవేల
వలచి వరించి మనసు హరించి
నను చికురించగనేలా

తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా

చుపులతోనే పలుకరించుతూ చాటున
వలపులు చిలకరించుతూ
చుపులతోనే పలుకరించుతూ చాటున
వలపులు చిలకరించుతూ
కోరిక తీరే తరుణము రాగా
తీరా ఇపుడీ జాగేలా

తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా

********   ********   *********

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: ఘంటసాల

అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా

లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా

నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా

ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరింపవా

********   ********   *********

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పి.నరసింహా రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

ఓ ఒ ఓ ఓ ఓ
మనసు పరిమళించెనే తనువు పరవశి౦చెనే
నవవసంతగానముతో నీవు నటనసేయగనె
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంతరాగముతో నీవు చెంతనిలువగనే

నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆ ఆ ఆ ఆ ఆ
నీకు నాకు స్వాగతమనగా కోయిలమా కూయగా
గలగల సెలయేరులలో కలకలములు రేగగా

మనసు పరిమళించెనే అహహ తనువు పరవశించెనే ఒహొహొ
నవరాగ వసంతరాగముతో నీవు చెంతనిలువగనె
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు ఘుమ ఘుమలుగా ఝుంఝుమ్మని పాడగా
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

తెలిమబ్బులు కొండకోనలపై హంసవలె ఆడగా
అహ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిమబ్బులు కొండకోనలపై  హంసవలె ఆడగా
రంగ రంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top