చిత్రం: శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: సుశీల, ఘంటసాల
నటీనటులు: యన్.టి. రామారావు, శోభన్ బాబు, దేవిక
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: అట్లూరి పుండరీకాక్షయ్య
విడుదల తేది: 12.10.1967
సాకీ:
మెరుగు చామన ఛాయ మేని సొంపుల వాడు
నును మీగడల దేలు మనసున్న చెలికాడు
దొరవోలె నా మనసు దోచుకున్నాడే..
పల్లవి:
జగములనేలే గోపాలుడే
జగములనేలే గోపాలుడే… నా సిగలో పూవవును ఈనాడే
మగువుల నేలే గోపాలుడే… నీ మనసే దోచెను ఈనాడే
మగువుల నేలే గోపాలుడే..
చరణం: 1
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
కోరినంతనే దొరకవులే…
మదనుని గెలిచిన మగరాయని గని
మదనుని గెలిచిన మగరాయని గని
మల్లెలు తామే వలచునులే
మగువా నీ మది తెలిసెనులే
జగములనేలే గోపాలుడే… నీ మనసే దోచెను ఈనాడే
చరణం: 2
భామా మానస పంజరమ్ములో
భామా మానస పంజరమ్ములో.. రామ చిలుకవై నిలిచేవా
పంజరమైనా ప్రణయ దాసునికి
పంజరమైనా ప్రణయ దాసునికి … పసిడి మేడయే ప్రియురాలా
బాసయె చేసెద ఈ వేళా..
జగములనేలే గోపాలుడే.. నీ మనసే దోచెను ఈనాడే
చరణం: 3
చేసిన బాసలు చిగురులు వేయగ
చేసిన బాసలు చిగురులు వేయగ… గీసిన గీటును దాటవుగా
అందముతో నను బందీ జేసిన
అందముతో నను బందీ జేసిన… సుందరి ఆనతి దాటేనా
ఉందునే ఓ చెలి నీలోనా
జగములనేలే గోపాలుడే … నా సిగలో పూవాయే ఈనాడే
మగువుల నేలే గోపాలుడే … నీ మనసే దోచెను ఈనాడే
****** ******* *******
చిత్రం: శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సముద్రాల(జూ)
గానం: పి. సుశీల
పల్లవి:
ఏమేమో అవుతుంది… ఎగిసి ఎగిసి పోతుంది
ఏమేమో అవుతుంది… ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు… రేకులు విప్పిన తొలి వయసు
ఏమేమో అవుతుంది… ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు… రేకులు విప్పిన తొలి వయసు
రేకులు విప్పిన తొలి వయసు…
చరణం: 1
పువ్వులు… మువ్వలు…
పువ్వలు పులకరించి నవ్వులొలుకుతున్నవి… ఈ.. ఈ..
మువ్వలు పరవశించి సవ్వడి చేస్తున్నవి.. సవ్వడి చేస్తున్నవి
ఏమేమో అవుతుంది… ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు… రేకులు విప్పిన తొలి వయసు
రేకులు విప్పిన తొలి వయసు…
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ….ఆఆ…. ఆ..ఆ..
చరణం: 2
నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చెనా
నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా
ముంగిటనే నిలిచెనా…