చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , మీనా, అర్జున్ , సౌందర్య
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: వి.రవిచంద్రన్
విడుదల తేది: 22.06.2001
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ… కరమేలా ఈ… కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
చరణం: 1
మార్కండేయ రక్షపాదం మహాపాదం… ఆ… ఆ…
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా…
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో…
అందనీ అనాధనైతీ మంజునాథా…
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ… ఈ… శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
చరణం: 2
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ… ఆ… ఆ…
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం …
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథా…
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో…
ఛీ పొమ్మంటినే పాపినైతినే…
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ…తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం… ఈ పాదం దివ్య పాదం
****** ****** ******
చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: యస్.పి. బాలు
ఒక్కడే… ఒక్కడే… మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి ఒక్కడే దిక్కొక్కడే
నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
లోకాల దొరకాదు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాధ మంజునాధ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే
శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
శంకర మురహర శంభో హర హరా
మంజునాధ మంజునాధ
మంజునాధ మంజునాధ