చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, బృందం
నటీనటులు: నాగార్జున, స్నేహ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
విడుదల తేది: 20.03.2006
ఓం… ఓం… ఓం…
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురీ
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
రాం రాం రాం రాం
రామనామ జీవన నిర్నిద్రుడు
పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ
దర్శనమిచ్చెను మహావిష్ణువూ
సాససా నీదరి సానిదాప
గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడూ
ధరణిపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సమితుడై
కొలువు తీరె కొండంత దేవుడూ
శిలగా మళ్ళీ మలచీ
శిరమును నీవే నిలచీ
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ
వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
******** ********* ********
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ
గానం: దేవి శ్రీ ప్రసాద్, కీరవాణి, మాళవిక
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ , ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మా…
కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట
ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు…
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
******** ********* **********
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వేద వ్యాస
గానం: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాసు
అల్లా
శ్రీ రామా
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారుముద్దుగ
అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ
శ్రీ రామ
పా ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ
కోదండ రామ
మ ప ని స రి స ని ప ని ప మ
సీతా రామ
మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ
ఆనంద రామ
మా మా రి మ రి మ రి స రి మ
రామ జయ రామ
స రి మ
రామ
స ప మ
రామ
పా వననామ
ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదె మల్పులేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
dhasaradhi song upload cheyyandi