Sri Ramulayya (1998)

చిత్రం: శ్రీరాములయ్య (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కలేకురి
గానం: కే. జే యేసుదాస్, చిత్ర, వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: పరిటాల సునీత
విడుదల తేది: 1998

భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
అలీ పుస్తిలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వల వల వల ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవిడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికోస్తే పండుగచేద్దామురో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతారో అమ్మలాలా
చేలుదున్ని సాళ్ళు దీర్సే బీద బిక్కి జాతారో అమ్మలాలా
ఎద్దు కొమ్ముల నడుమా ఎర్రపొద్దు పొడిచెరో భూస్వామి గుండెలధర గుడిసలోళ్ల జాతర

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

చెమట జల్లుచిలకరిస్తే నేల పులకరించురో అమ్మలాలా
వానోస్తే భూతల్లి సీమంతామాడురో అమ్మలాలా
తంగేళ్ళు గన్నేర్లు పసుపుకుంకుమిచ్చురో అమ్మలాలా
పసుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగేనో
గజ్జల మెతల్లో పల్లె పరవసించెనో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

దిగువా పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా
చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో
నా సీమ తమ్ముల్లో వెలుగులు నిండేనురో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

*********   *********   *********

చిత్రం: శ్రీరాములయ్య (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న
గానం: యస్. పి. బాలు, చిత్ర

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

వానగాలికి సీమ తానమాడినపుడు వజ్రాలు ఈ నేల వంటిపై తేలాడు
పొరలు నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు
బంగారు ఘనులున్న కుంగదీ తల్లీ పొంగిపోదమ్మా

కలియుగంబున నరులు ఓర్వలేరని తెలిసి నల్ల రాయై వెలసి ఎల్లలోకములేలు
వెంకటాచలము భువైకుంఠ స్థలమో వైకుంఠ స్థలము
దర్శించినా జన్మా ధాన్యమౌతాదో పుణ్యమౌతాదో

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

హరిహరభుక్తరాయ అడివి వేటాకెళితే కుందేళ్లు కుక్కల ఎంటబడ్డాయంట
పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో  జీవగడ్డమ్మో
ప్రతినబట్టిన శత్రువిక పతనమేరా ఇక పతనమేరా
పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ ఆధి గురువుల తపము నాచరించెను బిలము
హటకేశ్వర శిఖరమవని కైలాసం అవని కైలాసం
తనుకుతా వెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు
సీమ ఊరూరున మారు మ్రోగుతాయి
శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మో
వీరబ్రహ్మం ముఠము సీమకే మఖుటం సీమకే మఖుటం
పాలబుగ్గల నోట వేణువు మీటితే ఆలమందలు కంచె బీళ్లు పరవశించు
నింగిలో చంద్రుడు తొంగిచుసితే  తొంగిచుసితే
సీమలో కోలాటమే సిందుతొక్కు చిరుగజ్జలాడు

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

ఎత్తు బండరాళ్లు ఎర్రని దుప్పులు పనుగు రాళ్ళ గట్లు పరికి కంపపొదలు
నెర్రెడ్డు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు
ఆరు తడుపుకు పెరిగే వేరు సేనగమ్మో వేరు సేనగమ్మో
నల్లమల్లడవుల్లోతెల్లబారే పొద్దు అంబకేలకి సీమ మీదగ్గి కురిపించు
సందేపూట నుండి కొండ నీడల్లో కొండ నీడల్లో
సల్లగాలికి ఒళ్ళు మరచి నిదురించు అలసి నిదురించు

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
ఓహో… ఓ ఓ ఓ… ఆహా హా హా  ఓ హే హా ఓ

*********   *********   *********

చిత్రం: శ్రీరాములయ్య (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న
గానం: వందేమాతరం శ్రీనివాస్

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో
రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

బీటవారిన బీడు భూమిలో ధుమ్ము రేపిన ఇసుక దుబ్బలు
ధారలై పారిన సెమటతో ధాన్య రాసుల శుద్ధిజేసిన
రైతు కూలి నాపై కక్ష కట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

లెక్కలేని పోలీసు మూకల మరతుపాకుల నిచ్చి పంపి
పచ్చని పల్లెల్లో పేదల బ్రతుకులో చితిమంట రేపుతు
చిత్రహింసలు పెట్టుతున్నారో
ఏమెరుగనోళ్ల ఎదలపై గన్నులు మోపిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భర్తలను గుంజలకు కట్టి భార్యలను సెరబట్టి చెరిసిరి
పచ్చి బాలింతలును కూడా పట్టితెచ్చి చెరలో బెట్టి
తల్లిఒడి కడబాపినారమ్మో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భన్జరూసి భాయిజామా బలిసినోళ్ల మిగులు భూములు
పంచమని పేదోళ్లు ఒకటై చండబాపి చాండుగడితే
అరె బ్రతుకు చూపని దొరల రాజ్యంలో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

ఇన్ని హింసలు పెట్టి రాజ్యం ఎలెటోడని తింగ చూస్తాం
ఎలెటోడని తింగ చూస్తాం
చెమట తీయని ఊరి దొరలను సేలకడుగు పెట్టనీయం
సేలకడుగు పెట్టనీయం
పెద్దరీకం చేసే కంతిరి గద్దలానిక తరిమి కొడతాం
గద్దలానిక తరిమి కొడతాం
ఆక్రమించిన దొరల భూమిలో
అరక కట్టి సాల్ దోళుతాం
అరక కట్టి సాల్ దోళుతాం
డొక్కలల్లో గుండ్లు దిగినా దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Chinababu (1988)
error: Content is protected !!