చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: కేె. జె. యేసుదాసు
నటీనటులు: విజయ్ చందర్, చంద్రమోహన్, జె. వి. సోమయాజులు, అంజలీ దేవి
దర్శకత్వం: కె.వాసు
నిర్మాతలు: గోగినేని ప్రసాద్, కె.బాబురావు
విడుదల తేది: 1986
హే… పాండురంగా
హే… పండరి నాథా
శరణం శరణం శరణం
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను
ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసికొనెను
దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో
ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై
జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం
భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
********* ********* *********
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: కేె. జె. యేసుదాసు
మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్యా
మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్యా
పసి పాప మనసున్న ప్రతి మనిషి లోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్ధుడవుతాడని
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి
మాలో కలతల్ని మాపేస్తివి
మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్యా
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ
వారి బాధల్ని మోశావయా
ఏనాడూ పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఎనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నీవాసమాయే ధన్యులమైనామయా
మాకు దైవమై వెలిశావయా
మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
********* ******** *********
చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి. బాలు
బాబా సాయి బాబా, బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా, బాబా సాయి బాబా
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు (2)
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం ముగై పోతాడా…
బాబా సాయి బాబా, బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా, బాబా… సాయి బాబా
దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ
రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేనీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్ను ఐక్యం ఐపొనీ పోనీ…
********* ********* **********
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి. బాలు
సాయి బాబా… సాయి బాబా…
సాయి నాథా… సాయి దేవా…
సత్యం నిత్యం నీవే కావా
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణం మేమోపలేము
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిశాము దినం దినం సాయి
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి
శ్రీరాముడైనా శ్రీక్రిష్ణుడైనా ఏ దైవమైన ఏ ధర్మమైనా నీలోనే చూశాము సాయి
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
మా ఏసు నీవే నని మా ప్రభువు నీవే నని ప్రార్ధనలు చేశామయ నిన్నే
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలామ్ సలామ్ నీకే
గురునానకైనా గురు గోవిందైన గురు ద్వారమైనా నీ ద్వారకేనని
నీ భక్తులైనాము సాయి
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణం మేమోపలేము
నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
క్రిష్ణ సాయి క్రిష్ణ సాయి రామ సాయి
క్రిష్ణ సాయి క్రిష్ణ సాయి రామ సాయి
అల్లా సాయి మౌలా సాయి
అల్లా సాయి మౌలా సాయి
నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డీ సాయి ఓం
నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డీ సాయి ఓం
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
ఓం…
********* ********* **********
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: వి. రామకృష్ణ
జై శ్రీ షిరిడీ నాథా సాయి దేవా ప్రభో…
శ్రీమన్మహా దేవ దేవేశ శిరిడీశ సాయిశ
వాగీశ లోగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమాం పాహిమాం
బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామిప్య సాయుజ్య
సామ్రాజ్య సందాయకా వేదవేదాంగ సర్వార్ధ వాక్యార్ధ
సంభావన దూర్య దేహియమాన ప్రతాప
చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప
సాయి దేవా పాహిమాం పాహిమాం
దీనాలి దీనార్తి రోగార్తి విచ్చేధనా భవ్య దివ్యఔషద ప్రభావ
అచింత్య స్వరూపా ఆనంద సందాయక బహుజన్మ ప్రారబ్ద బాధా వినిర్ముక్త సాద్గుణ్య
శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమాం పాహిమాం
దేవాది దేవా సమస్తంబు కల్పింప పాలింప దూలింపగా
పెక్కు దివ్యవతారంబు లంబొందు నీ పాద పంకేరు హాధ్యాన పారీర
సుస్వాంతులై ఎప్పు భక్తాళి నిన్ బ్రోవవే
దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాసా
శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే… నమః
********* ********** **********
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశిల
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
త్రేతాయుగమున రాముడుగా ద్వాపర మందున కృష్ణుడుగా
త్రేతాయుగమున రాముడుగా ద్వాపర మందున కృష్ణుడుగా
కలియుగేషు బుద్ధుడు అల్లా
కలియుగేషు బుద్ధుడు అల్లా కరుణా మూర్తులుగా
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
శాంతి స్థాపన చేయుటకై
శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
******** ******** ********
చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల
స్వామి సాయి నాధయ దివ్య మంగళం
షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం
స్వామి సాయి నాదాయ దివ్య మంగళం
షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం
మామకా భీష్టదాయ మహిత మంగళం
మామకా భీష్టదాయ మహిత మంగళం
లోకనాదాయ సాయి దివ్య మంగళం
భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం
లోకనాదాయ సాయి దివ్య మంగళం
భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం
స్వామి సాయి నాదాయ దివ్య మంగళం
షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం
భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం
భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం
సత్య తత్వ బోధకాయ సాదువేషాయతే
మంగలప్రదాయకాయ నిత్య మంగళం
నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం
శ్రీ సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయినాధ్ మహరాజ్ కి జై