చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: యన్. టి.రామారావు
నిర్మాత: యన్. టి.రామారావు
విడుదల తేది: 28.09.1979
పల్లవి:
ఇది నా హృదయం.. ఇది నీ నిలయం..
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..
చరణం: 1
ఇది నా “శ్రీ” నివాసం… ఇది నీ రాణి వాసం
ఇది నా “శ్రీ” నివాసం… ఇది నీ రాణి వాసం
నాపై నీకింత అనురాగమా?… నా పై మీకింత ఆదరమా..
ఇది నీ ప్రణయ డోళ.. ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ..
ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..
చరణం: 2
ఎల్లలోకముల ఏలేవారికి ఈడా… జోడా ఈ సిరి?
వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి ..
ఇది నా భాగ్యం… ఇది మన భోగం..
ఇది నా హృదయం .. ఇది నీ నిలయం…
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..