Sri Venkateswara Mahatyam (1960)

sri venkateswara mahatyam 1960

చిత్రం: శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్. వరలక్ష్మి 
నటీనటులు: యన్. టి.ఆర్, సావిత్రి
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: వి.వెంకటేశ్వర్లు
విడుదల తేది: 09.01.1960

పల్లవి:
శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని

అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని..
అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని..
నీ హృదయ పీఠాన నివసించుదాన..
నీ హృదయ పీఠాన నివసించుదాన..

శ్రీదేవిని నీదు దేవేరిని

చరణం: 1
పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పదునాల్గు భువనాలు పరిపాలించు…
నీ మది నేలి లాలించు భాగ్యము నాదే..

శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని

చరణం: 2
కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా
కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా..
ఎనలేని అనురాగ సంతోషములతో.. ఆ… ఆ..
ఆ… ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఎనలేని అనురాగ సంతోషములతో..
యేనాటికీ మనకు ఎడబాటులేదు…
యేనాటికీ మనకు ఎడబాటులేదు

శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని

******  ******   *******

చిత్రం:  శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల 

పల్లవి:
శేషశైలావాస శ్రీ వేంకటేశా.. శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా..
శేషశైలావాస శ్రీ వేంకటేశా.. శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా

చరణం: 1
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు

ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి
ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి

శేషశైలావాస శ్రీ వేంకటేశా… 

చరణం: 2
పట్టుపానుపు పైన పవళించర స్వామి
పట్టుపానుపు పైన పవళించర స్వామి
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ

చిరు నగవులొలుకుచూ నిదురించు నీ మోము
చిరు నగవులొలుకుచూ నిదురించు నీ మోము
కరువు తీరా కాంచి తరియింతుము మేము

శేషశైలావాస శ్రీ వేంకటేశా..
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా

******  ******   *******

చిత్రం: శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. వరలక్ష్మి

పల్లవి:
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా

చరణం: 1
దేవతలు దీవించి.. పంపిన పసరమయ
దేవతలు దీవించి.. పంపిన పసరమయ
కొన్నవారి కన్ని సిరులు కూర్చు గంగిగోవయా

వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా

చరణం: 2
మనిషికున్న తెలివున్నది.. మనిషిలోని చెడులేనిది
కొందామని అందరూ కొమ్ము పడితే కుమ్ముతుంది
కోరుకున్న వారివెంట గోవులాగే వస్తుంది

వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా

చరణం: 3
పచ్చనీ లచ్చిమికి పసుపు కుంకుమ పెట్టి దినము
ప్రొద్దున్నే మొక్కుకుంటే పోతుంది పాపము

ఆ.. ఆ.. ఆ.. ఆ… ఆ..
పాత్ర చూచి పాలను… మనసు తూచి మంచిని
ఇచ్చేది యీ ఆవు యిదే కామధేనువు

వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. ఆ.. ఆ.. ఆ..

******  ******   *******

చిత్రం:  శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం:  పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
కలగా.. కమ్మని కలగా..
మన జీవితాలు మనవలెగా..
కలగా.. కమ్మని కలగ..

అనురాగమె జీవన జీవముగా..
ఆనందమె మనకందముగా…
కలగా.. కమ్మని కలగ..

చరణం: 1
రాగవశమున మేఘమాలిక.. మలయ పవనుని కలిసి తేలదా
ఆ.. ఆ… ఆ.. ఆ…
రాగవశమున మేఘమాలిక.. మలయ పవనుని కలిసి తేలదా..
కొండను తగిలి గుండియ కరిగి… నీరై ఏరై పారునుగా

కలగా.. కమ్మని కలగా..
మన జీవితాలె ఒక కలగా.. కమ్మని కలగా

చరణం: 2
వెలుగు చీకటుల కలబోసిన…
యీ కాలము చేతిలో కీలుబొమ్మలము

భావనలోనే జీవనమున్నది..
మమతే జగతిని నడుపునది..
మమతే జగతిని నడుపునది..
కలగా… కమ్మని కలగా…

చరణం: 3
తేటి కోసమై తేనియ దాచే.. విరికన్నియకా సంబరమేమో?
వేరొక విరిని చేరిన ప్రియుని.. కాంచినప్పుడా కలత యేమిటో?
ప్రేమకు శోకమె ఫలమేమో.. రాగము.. త్యాగము.. జతలేమో

కలగా.. కమ్మని కలగా…
ఆ.. ఆ… ఆ…. ఆ…ఆ…..ఆ…
ఆ.. ఆ… ఆ…. ఆ…ఆ…..ఆ…
ఆ.. ఆ… ఆ…. ఆ…ఆ…..ఆ…
కలగా.. కమ్మని కలగా…

******  ******   *******

చిత్రం: శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఆ… ఆ… ఆ..
ఆ… ఆ… ఆ.. ఆ..
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో…
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో..

చరణం: 1
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
అరయగ హృదయము అర్పించితినే.. ఆదరించునో.. ఆదమరచునో

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో…

చరణం: 2
వలరాజా? కలువలరాజా? కాడే.. కనులకు కనులకడుపడినాడే..
అకళంకుడే.. హరినాంగుడు కాడే..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అకళంకుడే.. హరినాంగుడు కాడే.. మరి ఎవరో.. ఏమయినాడో…

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో…

ఎవరో.. తానెవరో… ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో..
ఎవరో.. తానెవరో… ఆ నవమోహిని.. ఎవరో..

చరణం: 3
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..

తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో…
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో…
మనసిచ్చినదో.. నను మెచ్చినదో..
ఆ… జవ్వని..

ఎవరో.. తానెవరో… ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో.. ఎవరో.. తానెవరో…

******  ******   *******

చిత్రం: శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: శాంత కుమారి

పల్లవి:
గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ..

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ
యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా… ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
ఎంత పిలచినా… ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..

చరణం: 1
వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా.. నా బ్రతుకు
కరగిపోయెరా.. నా బ్రతుకు

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా… ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..

చరణం: 2
వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట..
ఆ.. ఆ.. ఆ.. ఆ…
వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట

పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
యీ తల్లి హృదయము ఓర్వలేదయా..

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా… ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top