రాశాను ప్రేమలేఖలెన్నో.. లిరిక్స్
చిత్రం: శ్రీదేవి (1970)
సంగీతం : జి కె వెంకటేశ్
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య
నేపథ్యగానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి
రాశాను ప్రేమలేఖలెన్నో..
దాచాను ఆశలన్నీ నీలో..
భువిలోన మల్లియలాయే..
దివిలోన తారకలాయే..
నీ నవ్వులే….
రాశాను ప్రేమలేఖలెన్నో..
దాచాను ఆశలన్నీ నీలో..
భువిలోన మల్లియలాయే..
దివిలోన తారకలాయే..
నీ నవ్వులే..
దాచాను ఆశలన్నీ నీలో..
భువిలోన మల్లియలాయే..
దివిలోన తారకలాయే..
నీ నవ్వులే..
కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నదీ…
కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నదీ…
నా మనసు నిన్నే తలచి ఓయన్నదీ…
మురిపించే ముద్దు గులాబీ.. మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో.. సిగ్గేసింది
నా మనసు నిన్నే తలచి ఓయన్నదీ…
మురిపించే ముద్దు గులాబీ.. మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో.. సిగ్గేసింది
రాశాను ప్రేమలేఖలెన్నో..
దాచాను ఆశలన్నీ నీలో..
భువిలోన మల్లియలాయే..
దివిలోన తారకలాయే..
నీ నవ్వులే….
దాచాను ఆశలన్నీ నీలో..
భువిలోన మల్లియలాయే..
దివిలోన తారకలాయే..
నీ నవ్వులే….
నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో..
నీ చల్లని రూపం ఉంది నా కనులలో..
నాలోని సోయగమంతా విరబూచెలే..
నాలోని సోయగమంతా విరబూచెలే..
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే..
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే..
రాశాను ప్రేమలేఖలెన్నో..
దాచాను ఆశలన్నీ నీలో..
భువిలోన మల్లియలాయే..
దివిలోన తారకలాయే..
నీ నవ్వులే..
అందాల పయ్యెద నేనై ఆటాడనా..
కురులందు కుసుమము నేనై చెలరేగనా..
నీ చేతుల వీణను నేనై పాట పాడనా..
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా..
రాశాను ప్రేమలేఖలెన్నో..
దాచాను ఆశలన్నీ నీలో..
దాచాను ఆశలన్నీ నీలో..