1.శృంగార రసరాజమౌళి.. లిరిక్స్
శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా..
రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా..
చెంగు బరువాయెరా…
కన్ను కోరింది నీ కంటి పిలుపూ..
పెదవి కోరింది నీ పంటి గురుతూ..
బుగ్గ కోరింది నీ ముద్దు బులుపూ..
మేను కోరింది నీ కౌగిలింపూ..
అహో.. విశ్వదా..
విశ్వ విశ్వాంతరాల
విన్నూత్న లావణ్య విధ్యూల్లత
నీవే మన మనసున మధురిమలూదిన
మధన శాస్త్ర మహామహోపాధ్యాయి
ప్రణయ జీవన చరమ స్థాయి
శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా..
రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా..
చెంగు బరువాయెరా…
సిగ మల్లెలతో ఒకసరి భాసాడి
పొగరు పైటతో మరి మరి సైయ్యాడి
చికిలి వయసుతో సరి సరి ఆటాడి
సిగ మల్లెలతో ఒకసరి భాసాడి
పొగరు పైటతో మరి మరి సైయ్యాడి
చికిలి వయసుతో సరి సరి ఆటాడి
మరుల వెన్నెలల రేయెల్ల జల్లాడి
పట్టు విరుపులెరిగినట్టి రసికత
పుట్టుకతో ఆకట్టుకున్న ఓ.. ఓ…
శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా..
రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా..
చెంగు బరువాయెరా…
********** ********** ********** ********** **********
2.విశ్వధాబిరామ వినురవేమ.. లిరిక్స్
కాదు కాదు గురులు కా గుణింతము చెప్ప
శాస్త్ర పాఠములను చదివి చెప్ప
ముక్తి దారి చూపు మూలంబు గురుడు రా
విశ్వధాబిరామ వినురవేమ….
ఆలుసుతులు మాయ అన్న దమ్ములు మాయ
తల్లిదండ్రిమాయ తాను మాయ
తెలియనీదు మాయ దీనిల్లు పాడాయె
విశ్వధాబిరామ వినురవేమ….
శిలను ప్రతిమను జేసి చీకటిలోబెట్టి
మ్రొక్కవలవ దికను మూడులార
ప్రతిమ వుల్లమందు బ్రహ్మముండుట తెలియుడీ
విశ్వదాభి రామ వినురవేమ….
ఏది కులము నీకు ఏదిమతంబురా
పాదుకొనుము మదిని పక్వ మెఱిఁగి
యాదరించుచు దాని యంతము దెలియుము
విశ్వధాబిరామ వినురవేమ….
తత్త్వములలోనఁ బరమాత్మతత్త్వ మెఱిఁగి
నిత్యనిర్ము క్తపరిపూర్ణ నిలయమంది
సరి పరబ్రహ్మమయమని సంచరించు
నతఁడె పో పరశివుఁ డన నగును వేమ!
********** ********** ********** ********** **********
3.నీవెవరో నీ జన్మం.. లిరిక్స్
నీవెవరో నీ జన్మం ఏదో
నిజం తెలుసుకో జీవ
నిజం తెలుసుకో జీవ
సృష్ఠి క్రమమ్మును చెప్పెదనూ..
ఇది చిత్తశుద్ధితో వినవలెను..
పిండోత్పత్తి క్రమమ్మునరిండిన
జ్ఞాణోదయము కలిగేను
నీవెవరో నీ జన్మం ఏదో
నిజం తెలుసుకో జీవ
స్త్రీ పురుషుల సంయోగము
పవిత్ర కార్యము అని భావించవలె
సత్ సంతానము పొంది జాతికి
సౌభాగ్యము చేకూర్చవలీ
నీవెవరో నీ జన్మం ఏదో
నిజం తెలుసుకో జీవ
శుక్లాశోనితములు ఐదు దినమ్ములు
నీటి బుడగవలే ఉండునులే
పదిరోజులకు కోడిగ్రుడ్డు
ఆకారము అచ్చట చేకూరునులే
నెలకు గట్టి పిండముగా తేలి
శిరము ముందుగాతీరేను
రెండు నెలలకు కాళ్లు చేతులు
మూన్నెలలకు కడుపమరేను
నాలుగో నెలకు ఇరు పాశ్వమ్ములు
ఐదో నెలకు పాదాలు వ్రేళ్లు
ఆరో నెలకు ముక్కు కన్ను చెవి
నవరంధ్రాలే పడతవిలే
ఏడో నెలకు జీవుడు చేరును
మూర్చ్వముఖముగా పిండం ఉండును
నాభి మొదలు బ్రహ్మ రంద్రముదాకా
నాడి ఒకటి సమకూరునులే..
తల్లి జడరాన్ని పట్టులేకుండా
కొడుకు చుట్టుకొని ఉండునులే..
ఎనిమిది తొమ్మిది నెలల సమయమున
పూర్వజ్ఞానం ఉండునులే..
మలమూత్రమ్ముల మునిగి గర్భమున
తనలో తానే గొణుగునులే..
పూర్వజన్మమున పుణ్యము
చేయకపోతినే అనుచు చింతిచునులే..
ప్రాణ వాయువు ప్రసారం వలన
పిండం బయటికి చొచ్చునులే..
బొడ్డుకోసి చన్నీళ్ళు చల్లగా
పూర్వజ్ఞానం మరచునులే..
మానవ జన్మతత్వమిది
మహాత్ములెరిగిన గోప్యమిది
********** ********** ********** ********** **********
4.శివ గోవింద గోవింద.. లిరిక్స్
శివ గోవింద గోవింద
హరిహి ఓం
హరి గోవింద గోవింద
నా వాక్ ప్రభావమ్ము జ్ఞాన ప్రభోధమై కాల గతిని ఎరుక చేసెను
శివ గోవింద గోవింద
కలియుగమ్మున ఐదు వేలేండ్ల పిమ్మట
మనధర్మమే మారిపోయేను
కుల వివక్షత కూలిపోయేను
మానవులలో నీతి మటుమాయంయ్యేను
అన్యాయమే రాజ్యమేలేను
శివ గోవింద గోవింద
బ్రహ్మ వంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తిధర్మం వదలి పెట్టేరు
బ్రష్టులై చెడుదార్లు పట్టేరు
అగ్రహారమ్ములు మనిమాన్యములూపోయి ఉట్టి చెంబులు చేతపట్టేరు
శివ గోవింద గోవింద
రాజులందరూ కూడా భోగాలలో మునిగి రాజ్యమూడిత రాజులవుతారు
ప్రజలకు దండాలు పెడతారు
రాజ్యభవనాలన్ని భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు
శివ గోవింద గోవింద
వర్తక వ్యాపారములు వీడి వైశ్యులు నిజమన్నదాన్ని వదిలేసేరు
తలకు మాసిన పనులు చేసేరు
సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు
శివ గోవింద గోవింద
కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టకా… చట్టాల సందున నలిగేరు
పాలు నెయ్యి అమ్మి బ్రతికేరూ
భూమిపుట్టా ఊడి పొట్ట చేత పట్టి పట్టణాలకు వలస పోయేరు
శివ గోవింద గోవింద
వ్యాపారమనుపేరా తెల్లదొరలూ వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు
ప్రభువులై నెత్తి పైకేక్కేరు
ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో రేపి మన మతానికే ఎసరు పెడతారు
శివ గోవింద గోవింద
ఉత్తరదేశాన వైశ్యకులము నందు గాంధి అనువాడొకడు పుడతాడు
ఉత్తరదేశాన వైశ్యకులము నందు గాంధి అనువాడొకడు పుడతాడు
స్వాతంత్ర సమరమ్ము చేస్తాడు
రేకు ఫలము తోటి మేకవుతూ చివరకు తెల్లవాళ్ళను వెళ్ళగొడతాడు
శివ గోవింద గోవింద
ముండమోపూలంత ఏలికలు అయ్యేరు
మాలమాదిగా మంత్రులోచ్చేరు
విడ్డూరములు చాల జరిగేవు
వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వీరులు మున్ముందు పుడతారు
శివ గోవింద గోవింద
********** ********** ********** ********** **********
5.నందామయ గురుడ నందామయ.. లిరిక్స్
హరి హి ఓం….. హరి హి ఓం…….
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా
పాత ఆచారాలు పట్టు తప్పీపోయి పాతాళ హోమమై పోతాయయా
కపటనాగరికమ్ము స్త్రీ లోకమ్మున తలవిప్పుకుని తాండవిస్తుందయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
జుట్టు బొట్టు కట్టు వ్యవాహరములోన వల్లమాలిన మార్పులోచ్చేనయా
జుట్టు బొట్టు కట్టు వ్యవాహరములోన వల్లమాలిన మార్పులోచ్చేనయా
స్త్రీ పురుష బేధాలు తెలియకుండా పోయి వింతైన వేషాలు వేస్తారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
నగలుపెట్టుకొనుట నామోషి అయ్యెను బోసిమెడలా తోటి తిరిగేరయా
సిగలు జడలూ చెడ్డ మోటుగా తలచేరు క్రాఫింగులతో బయటికోచేరయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
కన్నబిడ్డలకు పాలివ్వడం మానేసి బుడ్డి పాలు పోసి పెంచేరయా
భర్తకూ బిడ్డలకూ వండి పెట్టుటవదలి వంట వాళ్లకు అప్పగిస్తారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయా
మందుమాకులుతిని ఆరోగ్యములు చెడి అష్టకష్టాల పాలవుతారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
ఉమ్మడి కుటుంబంలో కాపురం చేయక వేరు పడుటకు దార్లు వెతికేరయా
అత్తలు కోడళ్ళు జుట్లు జుట్లూ పట్టి కాపురంలో చిచ్చు పెడతారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
మగవారి పెత్తనం దిగజారి పోయెను మహిళా సమాజాలు లేచేనయా
మహిళా సమాజాలు లేచేనయా
మగని నెత్తిన ఇంత మట్టి చల్లేసి విడాకులకు సిద్ధమేనంటారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా
ఆస్తిలో మగవాడికాదిక్యమేమని సమజకై ఘర్షణలు జరిపేరయా
ఉద్యోగమ్ములు చేసి ఊళ్లేలవలేనని స్వేచ్చకై పతకాలు వేస్తారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
మంగళ్ళు చాకల్లు అధికారులయ్యేరు మధ్యమాంసాలు విధులమ్మేరయా
వైశ్యుండు చెప్పులా వ్యాపరుమునకుదిగు సూద్రుండు పందులూ పెంచేనయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
********** ********** ********** ********** **********
6.వినరా వినరా ఓ నరుడా.. లిరిక్స్
హరి హి ఓం…. హరి హి ఓం….హరి హి ఓం….
వినరా వినరా ఓ నరుడా……!
బ్రహ్మం మాట పొల్లుబోదురా కాల ఙ్ఞానం కల్లగాదురా
వినరా వినరా ఓ నరుడా……!
చదివాం చదివాం అంటారు విజ్ఞానం పెరిగిందంటారు
మూడత్వంతో మూగజీవులను రాళ్ళకు ఎందుకు బలి ఇస్తారు…
వినరా వినరా ఓ నరుడా……!
ఒరుల పచ్చనకు ఒర్వగలేరు
ఒళ్ళు వంచి పనిచేయగలేరు
తేరగ వస్తే తిందామంటూ తిన్నింటివాసలె లెక్కపెడతారు…
వినరా వినరా ఓ నరుడా……!
ప్రభుత్వమ్ములే మారెను ప్రజారాజ్యమే వచ్చేను
చట్టాలెన్నో తెచ్చేను జనులను తికమక పెట్టేను
వినరా వినరా ఓ నరుడా……!
బ్రహ్మం మాట పొల్లుబోదురా కాల ఙ్ఞానం కల్లగాదురా
వినరా వినరా ఓ నరుడా……!
సంపాదిస్తే సంపద పన్ను ఖర్చులు చేస్తే వేరొక పన్ను
కాలం తీరి చచ్చాడంటే ఉన్నది ఊడ్చుకు పోయేపన్ను
వినరా వినరా ఓ నరుడా……!
ఎక్కువ బిడ్డలకనడం తప్పని వితండవాదం చేస్తారు
పిచ్చి శాసనాల్ చేస్తారు…
పచ్చగ పెరిగే హైందవజాతిని ఉచ్చు వేసి ఉరితీస్తారు
వినరా వినరా ఓ నరుడా……!
భూమికి చట్టం పరిమితి పెట్టి ఉన్నది ఊడగొడతారు
రైతే వెన్నేముకన్నదేశాన ఆ రైతుకే ఘోరి కడతారు
వినరా వినరా ఓ నరుడా……!
బ్రహ్మం మాట పొల్లుబోదురా కాల ఙ్ఞానం కల్లగాదురా
వినరా వినరా ఓ నరుడా……!
అప్పెగొడ్డం తప్పుకాదని అధికారంగా చెబుతారు..
అప్పులు పుట్టక పేదసాద ఆలో లక్షణ అంటారు
వినరా వినరా ఓ నరుడా……!
గోదావరి తీరమ్మునందు ఒక బాల సన్యాసి వెలసెను
అన్నహారలేవి ముట్టక ఆశ్చర్యము కలిగించెను
వినరా వినరా ఓ నరుడా……!
పెనుతూపానులతో భుకంపాలతో ధరణి దద్దరిల్లి పోయేను
మతకలహాలతో కులవైరాలతో నెత్తుటేరులు పారెను
వినరా వినరా ఓ నరుడా……!
ఆదోనిలో అద్భుతమ్ముగా కప్పు కోడివలె కూసేను
శ్రీశైలంలో రాతి బసవయ్య కాలు దువ్వి రంకేసేను
కాలు దువ్వి రంకేసేను…
********** ********** ********** ********** **********
7.మామ కూతురా.. లిరిక్స్
మామ కూతురా! మరదలు పిల్ల ఓ! మామ కూతురా
ఆనాటి ముద్దెంత చలవో ఈనాటి ముద్దెంత వేడో
కొసరు ఇవ్వవే అసలు చెప్పుతా
కొసరు ఇవ్వవే అసలు చెప్పుతా
అమ్మ! ఆశ
అత్తమ్మ కొడుకా.. అల్లరి బావ ఓ…
అత్తమ్మ కొడుకా.. ఆనాటి సరసం వేరోయి
ఈనాటి వరసే వేరోయి
క్యారే మియా.. మేరె సయ్యా.. వహ్వా..
క్యారే మియా.. మేరె సయ్యా..
హేయ్.. నీవయసు పొడిచింది నాకోసమేలే..
నా బుగ్గ అడిగింది నీ ముద్దునేలే.. పో.. బావ హహా..
నీవయసు పొడిచింది నాకోసమేలే..
నా బుగ్గ అడిగింది నీ ముద్దునేలే..
హా.. నీ బులుపు కోరింది నా కౌగిలినే
అది నీ వాలకం చూస్తేనే తెలిసేలే..
సబ్నోకి షహజాది ఫూలోమ్కి షబ్-నమ్
బహారోకి ఖుషుబు మొహాబత్-కి ముజెసిమ్
మామ కూతురా మరదలు పిల్ల
కొసరు ఇవ్వవే అసలు చెప్పుతా
కొసరు ఇవ్వవే.. అసలు చెప్పుతా
అందం అరగదీసి గంధం పూసేను
పరువం పరిచేసి పానుపు వేసేను
వలపు వెచ్చగచేసి వడ్డించేను
వలపు వెచ్చగచేసి వడ్డించేను
మరువని రుచులెన్నో మచ్చుకందించేను
నా బుజ్జిగదే నా బాబుగదే అలగమాకే నేను నీకే..
అత్తమ్మ కొడుకా అల్లరి బావ హేయ్..
అత్తమ్మ కొడుకా.. ఆనాటి సరసం వేరోయి
ఈనాటి వరసే వేరోయి..
క్యారే మియా.. హహ.. మేరె సయ్యా.. ఓఓ..
క్యారే మియా.. మేరె సయ్యా..
మామ కూతురా! మరదలు పిల్ల మామ కూతురా!
ఆనాటి ముద్దెంత చలవో ఈనాటి ముద్దెంత వేడో
కొసరు ఇవ్వవే.. హహ.. అసలు చెప్పుతా.. హహ..
కొసరు ఇవ్వవే.. అసలు చెప్పుతా
********** ********** ********** ********** **********
8.చెంగున దూకాలి.. లిరిక్స్
చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి
చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి
పక్కనా.. నక్కినా.. పక్కన నక్కిన సిరిమల్లెచుక్క
ఉక్కిరి బిక్కిరి కావాలి బావ రొమ్ముపై వాలాలి అరెరే..
చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి
మరదలు పిల్ల పెళ్లంట బావే దానికి మొగుడంట అహ
మరదలు పిల్ల పెళ్లంట బావే దానికి మొగుడంట
ముచ్చటగా మూడు ముళ్ళేసి ముక్కు కొసరు పిండేనంట
ఉమ్… హబ్బబ్బబ పో.. బావ హహహా..
అయ్యింద అబ్బాయిగారి పని
నీకోరమీసం పదును జూసి కోటిరేసె ముక్కు జూసి
దొండపండు పెదవి జూసి ఆగలేనురా బావ
మక్కువతీరా ముద్దీయందే ఉండలేనురా బావ
చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి
రయ్యిన గాలికి పైటెగురుతుంటే
జవ్వున నడుము ఊగుతువుంటే
వాలు కనులు రమ్మంటుంటే
ఒంటి పొంగులు వరదవుతుంటే
లోకమే కరిగిపోవాలి ఆ….
స్వర్గమే కదిలి రావాలి
చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి
పక్కన నక్కిన సిరిమల్లెచుక్క
ఉక్కిరి బిక్కిరి కావాలి బావ రొమ్ముపై వాలాలి
********** ********** ********** ********** **********
9.ఏమండీ పండితులారా.. లిరిక్స్
ఏమండీ పండితులారా… ఏమండీ పండితులారా…
ఏమంటారు మీరేమంటారు….?
మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు….?
మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు….?
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
మేమే మేమే మేమేమఠాధిపతులమన్న ఆ అహం మీకులేకుంటేను
శ్రద్ధగా మీరువింటేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను
మీ ఉడత ఊర్పులకు భయపడను
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
గుణమును భట్టే వర్ణమన్న ఆ గీతాభాషము వినలేదా ఆ సత్యం మీ చెవి పడలేదా
సర్వమతమ్ముల సారమిదేనను సంగతి మీ దాక రాలేదా
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
కులాల మతాల భేదం పెట్టి సంఘాన్నే చీల్చేశారు సమానత్వాన్ని చంపారు
అంటరానితనంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
క్షూధ్రుడు వేదం వింటే.. క్షూధ్రుడు వేదం వింటే
చెవిలో సీసం కరిగించి పోయాలా చదివితే నాలుక కొయ్యాలా
వేదశాస్త్రమ్ములు మీసొమ్మనుకుని విద్యకు ద్రోహం చేస్తారా
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నారా ఓదారుస్తు ఉన్నారా
దూరం దూరం దూరం దూరం అంటూ పెద్దలు మడికట్టుక కూర్చుంటారా
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
హిందూ మతాన్ని గురువులు మీరే భ్రష్ఠు పట్టిస్తున్నారు ఐక్యత చెడగొడుతున్నారు
గతిలేక మనవాళ్ళు పరాయి మతాలకెగబడుతుంటే పళ్లికలిస్తూ చూస్తున్నారు
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
కృతయుగాన ఉడికిన మీ పప్పులు కలియుగాన ఇక ఉడకవులే జ్యాతహంకారములు సాగవులే
పశ్చ్యాతాపంతో మారకున్న పశ్చ్యాతాపంతో మారకున్న మీ బ్రతుకు బయట పడిపోవునులే
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు….?
ఏమండీ పండితులారా… ఏమంటారు మీరేమంటారు….?
********** ********** ********** ********** **********
10.చిలకమ్మ పలుకవే పలుకు.. లిరిక్స్
హరిహి ఓం హరిహి ఓం
చిలకమ్మ పలుకవే పలుకు… చిలకమ్మ పలుకవే పలుకు…
వీరబ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై విశ్వమంతాగూడ మరుమ్రోగేటట్టు
చిలకమ్మ పలుకవే పలుకు..
స్వాములని ఎందఱో లోకాన వెలసేరు దేవుడే తామని చెప్పుకుని తిరిగేరు
చేతిలో వీబూది ఉంగరాల్ తీసేరు చిటికెలోన జనుల సేవలందేరు
చిలకమ్మ పలుకవే పలుకు..
అన్ని రంగాలలో సంఘాలు పుట్టెను చీటికి మాటికి సమ్మేలే జరిగేను
యజమాని శ్రామికుల ద్వేషాలు ప్రభలేను దిన దిన గండంగా బ్రతుకులే మారేను
చిలకమ్మ పలుకవే పలుకు..
ఎంగిలాకులనే విక్రయిస్తారు, మల మూత్రములు కూడా వెలగట్టి అమ్మేరు
ఇనుమును దేశాలకెగుమతులు చేస్తారు, గుళ్ళోన లింగాల ఉళ్ళగించేస్తారు
చిలకమ్మ పలుకవే పలుకు..
నోటి మాటకు విలువ లేకపోయేను కాగితాలకు విలువ గొప్పగా పెరిగేను
పంది కడుపున ఏన్గు పిల్ల పుట్టెను, మారెమ్మ మనిషితో మాటలాడేను
చిలకమ్మ పలుకవే పలుకు..
పెళ్ళాల పేరుతో ఆస్తులే పెడతారు ఉన్నది దాచి దివాలా తీస్తారు
ప్రభుత్వం డబ్బుతో పరిశ్రమలే పెట్టి ప్రజల సొమ్మంతా దొక్కుమనిపిస్తారు
చిలకమ్మ పలుకవే పలుకు..
రూపయికొక గిద్ద నూకలమ్మేరు, మసి పాతనే ఒక్క మాటకమ్మేరు
ధరలు ఆకశానికెగిరిపోయెను పట్టపగలే బందిపోట్లు వచ్చేను
చిలకమ్మ పలుకవే పలుకు…
కొండలన్నీ పిండి కొట్టివేస్తారు, నదులు అడ్డం కొట్టి అదుపులో పెడతారు
హంసవాహనమేక్కి ఆకాశవీధిలో… హంసవాహనమేక్కి ఆకాశవీధిలో
పయనించెదరు జనులు భయమేమి లేకుండా ..
చిలకమ్మ పలుకవే పలుకు…
ఇనుప కమ్ములపై పొగ బండ్లు నడిచేను, నీటి ఆవిరి తోటి దీపాలు వెలిగెను
ఇనుప కమ్ములపై పొగ బండ్లు నడిచేను, నీటి ఆవిరి తోటి దీపాలు వెలిగెను
ధూర శ్రవనములు దూరదర్శినులు ధూర శ్రవనములు దూరదర్శినులు
దేశదేశాలలో వ్యాపించిపోయేను
చిలకమ్మ పలుకవే పలుకు…
కాలహస్తీశ్వరుని ఘనత తగ్గేను, తిరుపతి స్వామి ప్రభ వెలిగిపోయేను
కంచి కామాక్షమ్మ కన్నీరు కార్చేను, బెజవాడ దుర్గమ్మ కొండపగిలేను
చిలకమ్మ పలుకవే పలుకు…
పాయలుగ చీలేను భరత ఖండమ్ము కాశ్మీరమ్మున గొప్ప కలహాలు రేగెను
వంగ దేశమ్ములో వడిసుడుల్ వచ్చి గొంతు కొకలతోటి గుబ గుబలు పుట్టెను
చిలకమ్మ పలుకవే పలుకు…
ఉప్పు గుంటూరుకాడ వరద ముంచుకు వచ్చి ఊర్లు తుడిచి పెట్టి జననష్టమయ్యెను
అద్దంకి సీమలో ఐదేళ్ళ కుర్రాడు భావి గతులు విప్పి చెప్పేనూ
చిలకమ్మ పలుకవే పలుకు…
పాతాల గంగమ్మ పైకి లేచెను మల్లికార్జున స్వామి కాళ్ళు కడిగేను
బెజవాడ కృష్ణమ్మ కలియుగాంతమ్మున కనకదుర్గా ముక్కు పోగునంటేను
కనకదుర్గా ముక్కు పోగునంటేను ……
********** ********** ********** ********** **********
11.శివ గోవింద గోవింద.. లిరిక్స్
హరిహి ఓం … హరిహి ఓం…. హరిహి ఓం… హరిహి ఓం
శివ గోవింద గోవింద… హరి గోవింద గోవింద….
ఉత్పాతములెన్నో ఉద్బవిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను
అంతు పొంతూ లేని ఆపదల దేశంబు అల్లకల్లోలమై పోయెను
శివ గోవింద గోవింద…….
హంపిలో హనుమంతుడు ఆగ్రహమ్మున లేచి ఆర్బాటముగా కేక వేసేను
ఆ కేకలకు జనులు ఆదరిపోయేను ఆకు రాలినయట్లు రాలిపోయేను…
శివ గోవింద గోవింద…….
హైదరాబాదును మూసి మాహానది వరదతోటి ముంచి వేసేను
బావులు చెరువులు నీళ్ళు లేక ఎండి క్షామ దేవత తాండవించెను
శివ గోవింద గోవింద…….
ఉదయగిరిలో ఒక కాన్పుకే ఒక భామ ఏడ్గురు పిల్లల్నికంటుంది
సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి గ్రామాలనే మర్చివేస్తుంది
శివ గోవింద గోవింద…….
ఉన్నవాళ్లు లేనివాళ్ళు ఒక్కటే అని సామ్యవాదము పైకి వస్తుంది
బంగారమే కంటికగుపడక మాయమై ఇత్తడికి ఆదిక్యమోస్తుంది
శివ గోవింద గోవింద…….
శ్రీ గిరి మల్లయ్య దేవాలయమ్ములో పట్ట పగలే ముసళ్ళు దూరెను
తిరుపతి వెంకన్న గుడి నాల్గురోజులు పుజలేక మూతపడెను
శివ గోవింద గోవింద…….
తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యేను
అమెరికా దేశాన భుకంపములు పుట్టి పట్టణాలకే చేటు వచ్చేను
శివ గోవింద గోవింద…….
ఆరేండ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా మగచిన్నవాడు జన్మించేను
వేప చెట్టుకు అమృతబిందువులరీతిగా పాలు కారే రోజు వచ్చేను
శివ గోవింద గోవింద…….
ధరణి పట్టని జనం తల్లకిందులుగా పెరిగి తిండి గుడ్డ చాలకుండెను
తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చేలయించెను
తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చేలయించెను
శివ గోవింద గోవింద…….
కంచికి పడమర గాండ్లవారి ఇంట కామదేనువు ఒకటి పుట్టెను
పల్నాటిసీమలో ప్రజలవంచేన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచెను
శివ గోవింద గోవింద…….
గండికోటను మందుగుండు ప్రేలిపోయి జననష్టమే సంభవించెను
పచ్చెర్ల కోటలో కోడి మాట్లాడేను నేల్లురునకు ముప్పు వచ్చేను
శివ గోవింద గోవింద…….
వొంగుతులేచేటి ఈత చెట్టుని చూచి లోకులంత పూజ చేసేరు
వెనుకజన్మములోన జరిగిన కథలన్నీ మూడేళ్ళ బాలుడు చెప్పేను
శివ గోవింద గోవింద…….
యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను
యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను
వీరభోగా వసంత రాయుడుగ నేవచ్చి దుష్ట శిక్షణ అపుడు చేస్తాను
********** ********** ********** ********** **********
12.మతం నీతిరా.. లిరిక్స్
మతం నీతిరా కులం మాదిగరా
మతం నీతిరా కులం మాదిగరా
నే మనిషిని కాదంటారా
నన్నంటరాని ఓన్నంటారా
మతం నీతిరా కులం మాదిగరా
సెప్పేది శ్రీరంగ నీతులు
దూరేది దొమ్మర గుడిసెలు
మీ బ్రతుకు యే..హహ
మీ బ్రతుకు నాకెరికలేదంటారా
మతం నీతిరా కులం మాదిగరా
తొలుగు తొలుగుమని యెలియేస్తుంటరు
ముట్టితే మైలబడతమంటరు అవును ఔను..
ఊపిరిపోయాక యే..హహ ఊపిరిపోయాక
ఒలుక్కుల్లోన మట్టిచేయ మాపాల పడతరు
మతం నీతిరా కులం మాదిగరా
నీతులు లెస్సగ చెబుతు ఉంటరు ఆ..హహ
నెత్తిన చేతులు పెడత ఉంటరు నాయాల్ది
పొట్ట జానడు ఆశ బారెడు
డబ్బుకోసమై గడ్జితింటరు
మతం నీతిరా ఆహా.. కులం మాదిగరా ఉహాహ..
నీ ఇల్లేమీ నీది కాదురో
నీ వాళ్ళెవరు నీకు కారురో
ఉండేవరకు తింటరేగాని వ్యాక్..
పోయెటప్పుడు యెంటరారురో
ఆ..హహహహ
మతం నీతిరా కులం మాదిగరా
శాస్త్రలన్నీ సదిగిన ఓళ్ళు
పురాణాలు తిరగేసిన ఓళ్ళు
ఎక్కడో… దేవుడు ఉండడంటరు
అదెక్కడంటే నోరెళ్ళబెడతరు
మతం నీతిరా ఆహా.. కులం మాదిగరా ఉహాహ..
ఉండాడన్న ఆ దేవుడే ఉంటే..
కుల మతాలని కుళ్ళు ఎందుకూ.. ఎందుకు
బిడ్డల మధ్యన తంతులు పెట్టి
బిడ్డల మధ్యన తంపులు పెట్టి
గుళ్ళో కుక్కోని కుళకడమెందుకు
మతం నీతిరా కులం మాదిగరా
మతం నీతిరా కులం మాదిగరా
అంటరాని ఓళ్ళంటారా
మమ్మంటరాని ఓళ్ళంటారా…
మతం నీతిరా కులం మాదిగరా
మతం నీతిరా కులం మాదిగరా
********** ********** ********** ********** **********
13.మాయదారి మరల బండి రా … లిరిక్స్
మాయదారి మరల బండి రా ….
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా….
మాయదారి మరల బండి రా ….
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా….
పంచవింసతే తత్వమ్ములచే దశవిధములైన వాయువులచే
సప్త దాతువులు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మరా ….
మాయదారి మరల బండి రా ….
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా….
ఊపిరి పేరే హంస రా.. ఉచ్వాశ నిశ్వాసల కొలత రా …
అహం సోహం అను మార్గమ్మున పరమాత్ముడు నడిపే తమాషా బండి రా …
మాయదారి మరల బండి రా ….
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా….
భూమి నిలయమై గుధ స్థానమున
నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును
ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు నూర్ల హంస జపము జరుగును …
అధినాయకుడు గణపతి రా… అదే రా మూలాధార చక్రము….
ఆధార చక్రమునకు పైన రెండంగులములలో బుహ్యమందున
జనస్తానమై ఆరు ధలముల తెలుపు వర్ణమున వెలుగు చుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును…
అధినాయకుడు ప్రజాపతి రా … అదే రా స్వాదిష్టాన చక్రము…
స్వాదిష్టాన చక్రముపై మూడంగులములలో నాభియందున
అగ్నినిలయమై పది దలములతో నీలిరంగున వెలుగు చుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును…
అధినాయకుడు లక్ష్మీపతి రా … అదే రా మణిపూరక చక్రము…
మణిపూరక చక్రముపైన పది అంగులములలో హృదయమందున
వాయునిలయమై పన్నెండు దలముల పచ్చని కాంతితో వెలుగుచుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును…
అధినాయకుడు గౌరీపతి రా … అదే రా అనాహత చక్రము…
అనాహత చక్రము పైన పన్నెండు అంగులములలో కంఠమందున
గగననిలయమై పదహారు దలముల జ్యోతి వర్ణమున వెలుగు చుండును
రెండు గడియల నలభై ఐదు విఘడియలకు వేయి హంసల జపము జరుగును…
అధినాయకుడు జీవుడు రా … అదే రా విశుద్ధ చక్రము…
విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగులములలో భుమద్యమందున
అంతః కలనకు నిలయమై రెండు దలముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును
రెండు గడియల నలభై విఘడియలకు వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు సర్వేశ్వరుడు రా … అదే రా ఆగ్నేయ చక్రము..
ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మ రంద్రమొకటున్నది
ప్రణవ నిలయమై తేజోమయమై సహస్రదలముల కమలమందున
ఓం కారం ద్వనియించుచుండును…
రెండు గడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు గురుమూర్తి రా … అదే రా సహస్రారము….
ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓం కారము వినిపించును రా
భూమద్యమ్మున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించును రా
ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా ! ముక్తి మీకు ప్రాప్తించును రా !
********** ********** ********** ********** **********
14.పంచముడని నిను.. లిరిక్స్
పంచముడని నిను కించపరచిరని బాద పడకురా కక్కా
తిట్టినా నోరే నిన్ను పొగడుతూన్నపుడు వదిలేనురా వాళ్ళ తిక్కా
వదిలేనురా వాళ్ళ తిక్కా….
పంచముడని నిను కించపరచిరని బాద పడకురా కక్కా ….
ఆదిలోన కులమతాలు లేవు, వాడు వీడను తెడాల్లేవు
దేహానికే ఈ బెదాలన్ని, అంటరానితనం ఆత్మకు లేదు
పంచముడని నిను కించపరచిరని బాద పడకురా కక్కా ….
జగతిన వెలిగే సూర్య చంద్రులు నీ గూడాన వేలగానంటారా…?
భవనాల మండే అగ్నిదేవుడు నీ గుడిసెలో మండనంటాడ…?
చల్లగా వీచే వాయు దేవుడు మిమ్మంటకుండపోతున్నడా …?
ఆ దేవుల్లకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్కా…!
పంచముడని నిను కించపరచిరని బాద పడకురా కక్కా
జీవనాధారమైన నీరు మిమ్ము తాగవద్దు పొమ్మంటోందా..?
అందరికందని ఆకాశం అది మీకే అందకపోతోందా …?
సస్యస్యామలం ఐన నేల దున్నితే పండకపోతోందా…?
పంచభూతాలకే లేని పక్షపాతంబు మనలో ఎందుకు కక్కా…!
పంచముడని నిను కించపరచిరని బాద పడకురా కక్కా…. బాద పడకురా కక్కా
అందరు మీకే దాసోహం అను కాలం దగ్గరలో ఉంది
అగ్రగాములై రాజ్యాలేలే అదృష్టమ్ము పడుతుంది
తప్పదు రా నా మాట.. నే చూపింది సూటిమాట…
********** ********** ********** ********** **********
15.చెప్పలేదని అనకపోయేరు.. లిరిక్స్
చెప్పలేదని అనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు
చెప్పలేదని అనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు
నోరులేని పశువులట్లు మింటినెగిరి లాబమేమి
పరమార్థం సాదించే పుణ్యమార్గం తెలుసుకోండి …
చెప్పలేదని అనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు
బాల్యమందున అజ్ఞానంలో అల్లరి చిల్లర చేష్టలచేయుచు
వంటబట్టని చదువులతో మూడత్వంమ్మున మునిగిపోయినా
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు
యవ్వనమందున కన్నుకానకా…. కామక్రోద మద మాంసర్యాలతో
వావి వరుసలు లెక్కచేయక ఆముటేద్దు వలె స్వేచగా తిరిగినా
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు
కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకి నెట్ట
కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకి నెట్ట
కన్ను కనపడక చెవి వినపడక వృద్ధాప్యమ్మున వెతలకుండగా…
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు
ఆశ పాశం తెగదోసి అన్నచింతలు వదిలేసి
స్వపర బేదములు హెచ్చుతగ్గులు
కులమతమ్ముల గొడవలు మాని…
బ్రతుక్కు అర్థం తెలియకపోతే… పరమాత్ముని స్మరియించకపోతే..
ఏమి ఫలము లేదు.. జ్ఞానం ఏమి అంటుకోదు
ఎందుకురా నీకింత బాద.. జీవ వినుకోర కడసారి బోధ…
ఎందుకురా నీకింత బాద.. జీవ వినుకోర కడసారి బోధ…
రెక్కలను ముక్కలుగాజేసి రేయింపవల్ ఎన్ని అతుకులు అతికించినా
బొక్కడన్నమే కాని అంతకుమించి మిక్కిలేది నీకు…
ఎందుకురా నీకింత బాద.. జీవ వినుకోర కడసారి బోధ…
కఫవాతపిత్తాలు గతులు తప్పిననాడు..
మృత్యుదేవత వచ్చి మేడలు విరిచేనాడు
ఆలుబిడ్డలు నీకు కారు… అన్నదమ్ములు ఆపలేరు…
ఐశ్వర్య బలము నిన్ను ఆదుకొనుటకు రాదు…
దైవ చింతకునాడు తావులేనేలేదు..
ఎందుకురా నీకింత బాద.. జీవ వినుకోర కడసారి బోధ…
తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి..
వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి
ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు
నీవాళ్ళ నమ్ముకుని నిగ్గుతావెందుకు..
ఉసురుకాస్తా పోతే.. విసరి నేలకు కొట్టి..
నిముషమైన శవాన్ని నిలిపి ఉంచకపోరు
ఎందుకురా నీకింత బాద.. జీవ వినుకోర కడసారి బోధ…
జీవ వినుకోర కడసారి బోధ…