Sriramachandrulu (2003)

చిత్రం: శ్రీరామ చంద్రులు (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: మద్దెల శివకుమార్
గానం: కుమార్ సాను, శ్రీదేవి
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , శివాజి, బ్రహ్మానందం, రాశి, సింధు మీనన్, కోవై సరళ
దర్శకత్వం: ఐ. శ్రీకాంత్
నిర్మాత: డి.అనిల్ కుమార్
విడుదల తేది: 07.11.2003

సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
నా గుండె వేగానివే ఓ ప్రేమ గీతానివే

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా ఓ ఓ

దిక్కులు చూసే వేళా నువు పక్కకు చేరేవేళ
చెయ్యాలి పువ్వుల మేళా గోపాలా
చుక్కలు కాసే వేళా సిరిమల్లెలు పూచే వేళా
నును సిగ్గులు మొగ్గలు ఏలా ఓ జవరాలా

వెదురులో వేణువుంటుందని తెలుసు లోకానికి
నా గుండెలో నువ్వు ఉన్నావని తెలపాలి నీ మనసుకే
నీ తోడు కోరుకుంటున్నా నీడల్లే చేరుకుంటున్నా
మన్నించి నా మాటని అందించు నీ ప్రేమని
మన్నించి నా మాటని అందించు నీ ప్రేమని

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా ఓ ఓ

కుదురన్నదే లేదు నా మనసుకి పగలంత నీ ధ్యాసలో
ఓ కునుకన్నదే రాదు నా కంటికి రేయంత నీ ఊహలో
అందాల రామ చిలకమ్మా కాసింత జాలి చూపమ్మా
పరిచాను ఎద కాగితం కావాలి నీ సంతకం
పరిచాను ఎద కాగితం కావాలి నీ సంతకం

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
నా గుండె వేగానివే ఓ ప్రేమ గీతానివే ఓ ఓ