Srivalli (2017)

చిత్రం: శ్రీవల్లీ (2017)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ, శ్రీచరణ్ పాకల
సాహిత్యం: చైతన్య ప్రసాద్, శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, జొన్నవిత్తుల, భారతి బాబు
గానం:
నటీనటులు: నేహా హింజ్
దర్శకత్వం: కె.విజయేంద్రప్రసాద్
నిర్మాత: రాజ్ కుమార్ బృందావనం
విడుదల తేది: 24.02.2017

నీ పరిచయమే విలువైనది
నా ఎద గదిలో పదిలం
తీయని స్నేహం విడిపోనిది
ఏనాడు అది కాదు శిథిలం
నీ తలపులలో తడిసెను మనసు
నీ తహ తహలే మనసుకు తెలుసు
కనులే వెతికే నీకై

ప్రేమా ప్రేమా నిను చూడగానే
ఎగసే ఎగసే మనసే
నాలో నీవే సగభాగమైతే
నీలో నీలో సగమే

కాలమె మళ్ళీ విడదీసినా
నా ఎద నిన్నే తలచే
కాదని నువ్వే ఎడబాసిన
నే వెళ్లనంటోంది మనసే
నా ఎద కరిగి కన్నీరవగా
నీ తలపులతో కలవర పడగా
మిగిలా నిధిలో శిలగా

error: Content is protected !!