చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 15.01.1981
పల్లవి:
ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..
ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..
ముసుగులో పువ్వులు రెండు…
ముసుగులో పువ్వులు రెండు…
ఆడుకుంటున్నాయి… పాడుకుంటున్నాయి…
ఆడి పాడి కిందా మీదా… పడిపోతున్నాయి..
హా..హా..హా..హ…
హా… ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..
చరణం: 1
తొలకరి జల్లుల చినుకులలో… హా…
గడసరి చినుకుల తాకిడిలో… హా..
మగసిరి గాలుల సైగలలో… హా..
ఊపిరి సలపని కౌగిలిలో… హా…
చెట్టాపట్టాలెసుకొని.. చెట్టుల చాటుకు వస్తే..
పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే…
పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే…
మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
హా… ఎందుకు?
హోయ్… హోయ్.. ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..
చరణం: 2
చిరుచిరు నవ్వుల పెదవులపై.. హా…
కురిసి కురవని ముద్దులలో.. హా…
చిరు చిరు చెమటల బుగ్గలపై… హా..
తెలిసి తెలియని సిగ్గులలో… హా..
బుగ్గా బుగ్గ కలుసుకొని.. సిగ్గుల పానుపులేస్తే…
పెదవి పెదవి కలుసుకొని.. ముద్దుల రాగం తీస్తే…
పెదవి పెదవి కలుసుకొని.. ముద్దుల రాగం తీస్తే…
మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
ఛా… ఎందుకు?
ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..
ఆ… ఆకాశం ముసిరేసింది… ఊరంతా ముసుగేసింది..
ముసుగులో పువ్వులు రెండు…
ముసుగులో పువ్వులు రెండు…
ఆడుకుంటున్నాయి.. పాడుకుంటున్నాయి…
ఆడి పాడి కిందా మీదా పడిపోతున్నాయి..
హోయ్..ఆకాశం ముసిరేసింది… హా.. ఊరంతా ముసుగేసింది..
ఆ.. ఆకాశం ముసిరేసింది… ఆ.. ఊరంతా ముసుగేసింది..
****** ****** *******
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: సుశీల
పల్లవి:
తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే
తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..
శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు..
శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు..
చరణం: 1
కలగన్న మొదటి రాత్రికి.. తలుపు తెరచే వేళ ఇది
వలదన్న ఒంటి నిండా.. సిగ్గులొచ్చే వేళ ఇది..
బెదురు చూపుల కనులతో… ఎదురు చూడని వణుకులతో…
బెదురు చూపుల కనులతో… ఎదురు చూడని వణుకులతో..
రెప్పలార్పని ఈ క్షణం… సృష్టికే మూలధనం
తెప్పరిల్లిన మరుక్షణం… ఆడదానికి జన్మఫలం..
ఆడదానికి జన్మఫలం…
తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..
చరణం: 2
ఇన్నాళ్ళ మూగనోముకు… మనసు విప్పే వేళ ఇది..
ఇన్నేళ్ళ కన్నెపూజకు… హారతిచ్చే చోటు ఇది..
మల్లెపందిరి నీడన… తెల్లపానుపు నడుమన
మల్లెపందిరి నీడన… తెల్లపానుపు నడుమన
ఎదురు చూసిన ఈ క్షణం.. మరువలేని అనుభవం..
మరచిపోనీ ఈ స్థలం… ఆడదానికి ఆలయం…
ఆడదానికి ఆలయం…
తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..
****** ***** ******
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
చరణం: 1
చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. వారధి… ఆ ఉదయంప్రేమ పోకకు త్యాగం రాకకు .. సారధి… ఈ హృదయం
చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. వారధి ఆ ఉదయంప్రేమ పోకకు త్యాగం రాకకు .. సారధి ఈ హృదయం
అది వెలిగే ఉదయం.. ఇది కరిగే హృదయం
ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
చరణం: 2
జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. ఒకటే ఆకాశం
కలలు తీరినా.. కథలు చెరిగినా.. ఒకటే అనురాగం…
జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. ఒకటే ఆకాశం
కలలు తీరినా.. కథలు చెరిగినా.. ఒకటే అనురాగం…
అది మారని ఆకాశం… ఇది మాయని అనురాగం..
ఆకాశం ఎందరిదో.. అనురాగం ఎవ్వరిదో…
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
****** ***** ******
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
ఆ.. ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం… దీని యవ్వారం కాశ్మీరం
దీన్ని ఒల్లంతా కాశ్మీరం… దీన్ని చూస్తే కాశ్మీరం..
రామ్.. రామ్.. రామ్.. రామ్
ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ఆ.. మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
ముక్కుపచ్చలారని కాశ్మీరం.. మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
వీడి మనసంతా కాశ్మీరం… వీడి చూపులన్ని మాటలన్ని కాశ్మీరం..
వీడి మాటలన్ని కాశ్మీరం… వీణ్ణి చూస్తే కాశ్మీరం…
రామ్.. రామ్.. రామ్.. రామ్
చరణం: 1
మొదటి సారి చూసుకుంటే ఊరింతలు.. ఆపై కలుసుకుంటే ఉడికింతలు..
మొదటి సారి చూసుకుంటే ఊరింతలు.. ఆపై కలుసుకుంటే ఉడికింతలు..
కలిసి తిరుగుతుంటే… గిలిగింతలు
పెళ్ళిదాక వస్తే… అప్పగింతలు..
మనసు విప్పి కప్పుకుంటే.. అసలైన సిసలైన కేరింతలు…
ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
చరణం: 2
కళ్ళు కళ్ళు చూసుకుంటే.. చెలగాటము…
చెయ్యి చెయ్యి పట్టుకుంటే.. ఉబలాటము…
కాలు కాలు ముట్టుకుంటే.. బులపాటము…
బుగ్గ బుగ్గ రాసుకుంటే.. ఇరకాటము…
మనసు విప్పి కప్పుకుంటే అసలైన సిసలైన ఆరాటము…
ముక్కుపచ్చలారని కాశ్మీరం.. హా.. మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం.. వీడి చూపులన్ని మాటలన్ని కాశ్మీరం
దీన్ని ఒల్లంతా కాశ్మీరం.. వీణ్ణి చూస్తే కాశ్మీరం…
రామ్.. రామ్.. రామ్.. రామ్..
ముక్కుపచ్చలారని కాశ్మీరం… హహహా.. మూడుముళ్ళకొచ్చింది కాశ్మీరం
****** ****** ******
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి :
కాళ్ళగజ్జ కంకాళమ్మా.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా?
వేగుచుక్కా వెలగ పండు.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా?
పెళ్ళీ అంటే.. చుక్క పెట్టుకొచ్చా.. ఆ… ఆ..
రమ్మన్నావంటే.. గజ్జెలేసుకొచ్చా… ఆ.. ఆ..
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా.. ఆ.. ఆ..
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా.. ఆ.. ఆ…
హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా… హ … హ
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా… హ… హ
చరణం: 1
నిన్ను చూడగానే నాకు వయసు తెలిసింది
వయసు తెలియగానే పెళ్ళి గురుతుకొచ్చింది
కాళ్ళ మట్టెలు.. రాళ్ళ పోగులు.. ఎర్ర గాజులు.. నల్ల పూసలు.. సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
పెళ్ళి అనగానే నువ్వు గుర్తుకొచ్చా వు
నువ్వు గురుతు రాగానే ఆశ చచ్చిపోయింది
కాషాయాలు.. కమండలలౌ.. రుద్రాక్షలు.. పులిచర్మాలు సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ..
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ..
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా హా హా హా
చరణం: 2
పువ్వు పుట్టగానే గుప్పు గుప్పు మంటుంది
నేను పుట్టగానే నువ్వు నువ్వు అన్నాను
వెండి కంచము.. పందిరి మంచము.. గాలి పింఛము.. పూలగుఛ్చము సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను
రాతిరిపూట కలలోకి నువ్వే వచ్చావు
జాతరలోని అమ్మోరుని గుర్తుకు తెచ్చావు
వేప మండలు.. కల్లు కుండలు.. కోడి పెట్టలు.. పసుపు బట్టలు.. సిద్ధం చేసాను
నువ్వు ఊఁ అంటే జాతర పెట్టేస్తాను
నువ్వు ఊ అంటే జాతర పెట్టేస్తాను
అరె అహా కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ..
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ..
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా…
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా…
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా
లా లా లా….. లా లా లా…. లా లా లా…. లా లా లా
****** ****** ******
చిత్రం: శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి.బాలు, జానకి
పల్లవి:
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో
పాడినదీ… ఒక రాధిక… పలికినదీ.. రాగ మాలిక
ఇదే.. ఇదే.. ఇదే… నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో
చరణం: 1
కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పు నాట్యాలు నాట్యభారతి పాదాల పారాణి అద్దగా
అడుగుల అడుగిడి స్వరమున ముడివడి అడుగే పైబడి మనసే తడబడి
మయూరివై కదలాడగా… వయ్యారివై నడయాడగా
ఇదే… ఇదే… ఇదే… నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో
చరణం: 2
పయనించు మేఘాలు నిదురించు సృష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా
స్వరమున స్వరమై పదమున పదమై పదమే స్వరమై స్వరమే వరమై
దేవతవై అగుపించగా… జీవితమే అర్పించగా
ఇదే… ఇదే… ఇదే… నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో
పాడినదీ… ఒక రాధిక… పలికినదీ.. రాగ మాలిక
ఇదే.. ఇదే.. ఇదే… నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో… హృదయ వీణ తీగలో