చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి
నటీనటులు: నరేష్ , పూర్ణిమ, శ్రీలక్ష్మి
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: చెరుకూరి రామోజీరావు
విడుదల తేది: 24.02.1984
మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా… తెలుసా
మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే
చరణం: 1
ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకనీ మురిసేను నిన్ను తలచి
చదువా … పదవా … ఏముంది నీకు
తళుకు … కులుకు … ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా … తెలుసా
మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే
చరణం: 2
ఏ నోము నోచావు నీవనీ దొరికేను ఆ ప్రేమఫలము
ఏ దేవుడిస్తాడు నీకనీ అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా …తెలుసా
మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే
********* ********* ********
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో…జో…
నిదురపోలేని కనుపాపలకు జోల పాడలేకా
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేకా
ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్ మ్మ్ ప్రేమలేఖ..
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ
నా మనసును దోచినా చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
********* ********* ********
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాశలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చరణం: 1
అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చరణం: 2
అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
********* ********* ********
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
తననం తననం తననం
గమప మపని దనిసా…..
సనిదప సనిదప
దపగరి దపగరి
సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా
సా సా సా సా
రీ రీ రీ రీ
గా గా గా గా
పా పా పా పా
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతార
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతార
వీణవై… వేణువై… మువ్వవై… వర్ణమై…
వీణవై జాణవై వేణువై వెలధివై
మువ్వవై ముదితవై వర్ణమై నా స్వర్ణమై
నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతార
నెలవంక పల్లకిలొ ఇల్లవంక దిగిరావె
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతారా
చరణం: 1
అరుణం అరుణం ఒక చీరా…. అంబరనీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా… అంబరనీలం ఒక చీరా
మందారంలో మల్లికలా ఆకాశంలో చంద్రికలా
అందాలన్నీ అందియలై
శృంగారంలో నీలయలై
అందాలన్నీ అందియలై
శృంగారంలో నీలయలై
అలుముకున్న భూతావిలా
అలవికాని పులకింతలా
హిందోళ రాగ గంధాలు నీకు ఆందోళికా సేవగా
ఆ….
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతార
నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతార
చరణం: 2
హరితం హరితం ఒక చీరా… హంసల వర్ణం ఒక చీరా
హరితం హరితం ఒక చీరా… హంసల వర్ణం ఒక చీరా
శాద్వరాన హిమదీపికలా శరద్వేళ అభిసారికలా
చరణాలన్నీ లాస్యాలై… నీ చరణానికి దాస్యాలై
అష్టపదుల ఆలాపనే… సప్తపదుల సల్లాపమై
పురివిప్పుకున్న పరువాల పైట సుదతినేవీవగా ఆ….
ఆ…..
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతార
నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధార
రస సాగర యాత్రకు ధృవతారా…