చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చిరంజీవి , రాధ , భానుప్రియ
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 23.03.1989
పల్లవి:
తదిగినతోం తప్పదమ్మ..హేయ్… తడితాళం
తడబడినా..హేయ్… దక్కనీవే తొలి అందం
హేయ్.. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా
అరె..మాటా మాటా.. హహ.. మల్లేతోట… హెహె
అయితే జంట.. హహ.. నీతో ఉంటా
అదిరింది నాకు జోడి కుదిరింది…
ముదిరింది ముద్దు కాస్త ముదిరింది
హే ఎంత జోలా పాడుతున్నా గిల్లుతాడే గోలా
హేయ్.. మాటా మాటా.. హెహె.. మల్లెతోటా…
అయితే జంట…హహ.. నీతో ఉంటా
తదిగినతోం తప్పదమ్మ తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది హా…
చరణం: 1
జాలీ జానీ నా లవ్లీ రాణి నీ కొంగుకు ముడిపడిపోనీ
పోతేపోనీ ఏమైనా కానీ వయసుకు ఉడుకులు రానీ
నీదే రోజా నా సుప్రీం రాజా నీ కౌగిట తలబడిపోనీ
తాజాతాజా నా కౌగిలి లేజా పెదవికి మధువులు రానీ
అరే.. కన్ను కన్నూ వేటాడాలా నువ్వూ నేను ముద్దాడాలా
ఈడు జోడు పెళ్ళాడాలా… రావే
అంతో ఇంతో కవ్వించాలా… అందాలన్నీ నవ్వించాలా
ఆపుసోకు పండించాలా… రారా
తదిగినతోం తప్పదమ్మ..హేయ్… తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది… హా…
చరణం: 2
డీడీడిక్కి.. నా చెంపే నొక్కి నా ఒంటికి అంటుకుపోరా
నీ వేడికి నా గోడే దూకి వలపులు వలుచుకుపోరా
నక్కి నక్కి నీ పండే దక్కి నా ఆకలి తీరుచుకుపోనా
ఎంతో లక్కీ నీ జోడే దక్కి తళుకులు తడుముకుపోనా
ఉండీ ఉండీ ఊ కొట్టాలా ఉయ్యాలూపి జోకొట్టాలా…
వయ్యారాలే ఆకట్టాలా.. రారా
ముద్దుముద్దు ముట్టించాలా రెచ్చిరేగి రెట్టించాలా
ఒళ్ళో ఇల్లే కట్టించాలా.. రావే…
అదిరింది నాకు జోడి కుదిరింది…
ముదిరింది ముద్దు కాస్త ముదిరింది
హో ఎంత జోలా పాడుతున్నా గిల్లుతాడే గోలా
అరె.. మాటా మాటా.. హహ.. మల్లెతోటా…హెహె
అయితే జంట…హహ.. నీతో ఉంటా
తదిగినతోం తప్పదమ్మ..హేయ్… తడితాళం
తడబడినా..హేయ్… దక్కనీవే తొలి అందం
హేయ్.. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా
అరె..మాటా మాటా.. హహ.. మల్లేతోట… హెహె
అయితే జంట.. హహ.. నీతో ఉంటా
******* ******** ********
చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
అనురాగాలే…ఆలపించనా…
ఆకాశమే…మౌన వీణగా…ఆ.. ఆ… ఆ.. ఆ
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
చరణం: 1
నీ చిరునడమున వేచిన సిగ్గులు దోసిట దోచాలనీ
ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలనీ
హే.. పడుచుదనం చెప్పిందిలే..
పానుపు మెచ్చిందిలే…హో
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
చరణం: 2
తలపులు ముదిగిన తొలకరి వయసుకు
తొలి ముడి విప్పాలనీ
పెరిగే దాహం జరిపే తపనం పెదవికి చెప్పలనీ
హే తనువెల్లా కోరిందిలే…
తరుణం కుదిరిందిలే…హో
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
అనురాగాలే…ఆలపించనా…
ఆకాశమే…మౌన వీణగా…ఆ…ఆ…ఆ…ఆ
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
******* ******** ********
చిత్రం: స్టేట్ రౌడీ (1989)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే
ఓ ఓ ఓ ఓ ఓ …..
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు.. నే నాడితే నువ్వాగవూ
ఆ…. ఆ… ఆ…. ఆ..
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా
చరణం: 1
స్వరాలు జివ్వుమంటే… నరాలు కెవ్వుమంటే
సంపంగి సన్నాయి వాయించనా
పెదాలే అంటుకొంటే… పొదల్లో అల్లుకుంటే
నా లవ్వు లల్లాయి పండించనా
బుసకొట్టే పిలుపుల్లో… కసిపుట్టే వలపుల్లో
కైపెక్కి ఊగాలిలే
ఓ ఓ ఓ ఓ…
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
చరణం: 2
పూబంతి కూతకొచ్చి… చేబంతి చేతికిచ్చి
పులకింత గంధాలు చిందించనా
కవ్వింత చీర కట్టి…. కసిమల్లె పూలు పెట్టి
జడ నాగు మెడకేసి బంధించనా
నడిరేయి నాట్యంలో… తొడగొట్టే లాస్యంలో చెలరేగిపోవాలిలే
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే
హోయ్ హోయ్ హోయ్..
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు.. నే నాడితే నువ్వాగవూ
ఓ..ఓ..ఓ..ఓ…
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా