చిత్రం: స్త్రీజన్మ (1967)
సంగీతం: గంటసాల
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ, అంజలి, కృష్ణ కుమారి, ఎల్. విజయలక్ష్మి, గీతాంజలి, రాజశ్రీ, వాణిశ్రీ
దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 31-8-1967
పల్లవి:
ఏదో ఏదో ఏదో ఏదో ఔతున్నది
ఇదే ఇదే ఇదే ఇదే బాగున్నది
దోర వయసు దూకి దూకి పొంగుతున్నది
చరణం: 1
కరిగే వెన్నెల కవ్విస్తున్నది
కదిలే గాలిలో కైపేదో ఉన్నది
తీయని కౌగిలి పూవుల పందిరి
సై అంటే సై అన్నవి
చరణం: 2
పందెం వేసే అందాలున్నవి
ముందుకు లాగే బంధాలున్నవి
గుబ గుబ లాడే కోరికలేవో
కో అంటే కో అన్నవి