Student No.1 (2001)
Student No.1 (2001)

Student No.1 (2001)

చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, బృందం
నటీనటులు: జూ. యన్. టి. ఆర్, గజాల
దర్శకత్వం: యస్. యస్. రాజమౌళి
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 27.09.2001

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ

చరణం: 1
శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే
వాటే జోక్ వాటే జోక్
హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే
వాటే జోక్ వాటే జోక్
మాన్లీ ఫోజులు మధుర వాక్కులు
మ్యాజిక్ చూపులు నా సిరులు
ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు
ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
దేనికైనా రెడీ

చరణం: 2
సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే
వాటే జోక్ వాటే జోక్
చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే
వాటే జోక్ వాటే జోక్
వాడి వేడిగ ఆడిపాడితే
నేడే పోవును మీ మతులు
పోటాపోటీగ పొగరు చూపితే
నాకే వచ్చును బహుమతులు
రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి
మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి
దేనికైనా రెడీ… దేనికైనా రెడీ

**********   ************   ***********

చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె., వర్ధిని

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే
అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా… కాదంటారా!
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే

చరణం: 1
దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే
విజయం పొందిన వేళలలో వెనుదట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే
ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే
ప్రేమంటారా…
కాదంటారా!

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే

చరణం: 2
ఓ మనోహరీ చెలీ సఖీ
ఓ స్వయంవరా దొరా సఖా
మనసు నీదని మనవి సేయనా సఖీ
బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా
నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ…
నీ చెలిమిలేని క్షణములోన జగతిని
జీవింపజాలనోయ్ సఖా…
ఆ… ఆ…
నటనకు జీవం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై సెలవని వెళుతుంటే
నీ మనసే కలవర పడుతుంటే
ప్రేమంటారా…
జౌనంటాను…

**********   **********   **********

చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్ , చిత్ర

ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా
రంభ ఊర్వశి మేని చమటతోనా

ఏవెట్టి… ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా

నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా
నీకు కన్నుకొట్టు కుంటానని
నిన్ను కౌగిలించు కుంటానని
నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా
నీతో సందిచేసుకుంటానని
నీతో సందులోకి వస్తానని
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా
నీతో భాగస్వామినౌతానని
మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా
నీతో మూడు రాత్రులవ్వాలని
ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా
నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని

ఏవెట్టి… ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా
కాముడు పంపిన కోడి పులుసుతోనా
ఏవెట్టి… ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ

నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా
నిన్ను చూడగానే జారాలని ఆ మాట నోరు జారొద్దని
నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో  ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బయట చెప్పొద్దని
చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా
చిలిపి మాటలన్ని వినోద్దే అని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటేల మూగ బొమ్మని
నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని
అవి నీక్కూడా చెప్పొద్దని

ఏవెట్టి… ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా

Ashok (2006)
Previous
Ashok (2006)