చిత్రం: సుబ్బు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. కీరవాణి, కవితా కృష్ణమూర్తి
నటీనటులు: జూ. యన్. టి.ఆర్, సోనాలి జోషి
దర్శకత్వం: రుద్రరాజు సురేష్ వర్మ
నిర్మాతలు: ఆర్. శ్రీనివాస్, పి.యమ్. హరికుమార్
విడుదల తేది: 21.12.2001
నా కోసమే…
నా కోసమే నువ్వున్నావు తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచప్రాణాలుగా
పెంచుకోవాలట పంచుకోవాలట
నీ కోసమే
నీ కోసమే నేవున్నాను తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా
విన్నావొ లేదొ నువ్వీ సంగతి
లోకాన ప్రతి వారు అంటున్నది
కళ్ళార మనకేసి చూసేందుకే
చూపుంది అన్నారు నిజమా అది
యెం నీ మనసు ఆ మాట అవునేమొ అనలేదా
అనుమానంగా ఉన్నదా
జగమంతా అనుకొంటె కడ దాకా నిలిచేలా
సాగాలి ఈ ముచ్చట
ఈ బంధమే పంచప్రాణాలుగా
పెంచుకోవాలట పంచుకోవాలట
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంట లొ కోట కట్టిందట
నా కోసమే నా కోసమే
నాలోన యే వింత దాగున్నది
చిత్రంగ చూస్తావలా దేనికి
అసలైన సంత్రుప్తి కలిగుంటుంది
యీ బొమ్మ చెక్కాకె ఆ బ్రహ్మకి
ఓ ప్రాణం ఇద్దరిలో కనిపిస్తూ ఉంది కదా
సగభాగం నాకూ కదా
నీలోన సగమయేలా అదౄష్టం నాదైన
కల లాగె అనిపించదా
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచప్రాణాలుగా
పెంచుకోవాలట పంచుకోవాలట
నీ కోసమే
నీ కోసమే