చిత్రం: సుల్తాన్ (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్ , చిత్ర
నటీనటులు: బాలకృష్ణ , కృష్ణ, కృష్ణంరాజు, రోజా, రచన, దీప్తి భట్నాగర్
దర్శకత్వం: శరత్
నిర్మాతలు: యమ్. ఆర్. వి.ప్రసాద్
విడుదల తేది: 27.05.1999
పల్లవి:
ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక
మాపటి సరసం ముదిరాక
రేపటి విషయం తెలిసాక
రాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా
ఓ కాలికి రామచిలక కౌగిలికి సోగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక
చరణం: 1
ఏమి హొయలో ఎన్నెన్ని లయలో
ఎనక చూస్తుంటే
ఎన్ని ప్రియలో ఏమేమి ప్రియలో
ఎదురు చూస్తుంటే
కోకరైక కట్టిననాడు గోరంతలు
కోరిందంత చూసినాడు కొండంతలు
పడుచు హంసభలే నడిచిపోయే
ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక
చరణం: 2
చూపు తెలుపు నీ కోడె పిలుపు
కన్ను కొడుతుంటే
మూతి అలక నీ ముక్కుపుడక
మోజు పెడుతుంటే
వాటేస్తుంటే వాడి వేడి వడ్డింతలు
తూనిగమ్మ తుళ్ళే వాలే తుళ్ళింతలు
ఎంత జాణవులే ఓ ఎదనువాలే
ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక
మాపటి సరసం ముదిరాక
రేపటి విషయం తెలిసాక
రాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా
******** ******** ********
చిత్రం: సుల్తాన్ (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: సుఖ్విందర్ సింగ్ , సుజాత
హెయ్యామ హెయ్యామ
హెయ్యామ హే హే హెయ్యామా (2)
నంది కొండమీద చిందులేసె జాబిల్లీ
అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి
చల్లగాలిసోకి జిల్లుమంది సంపంగి
పిల్లదానికిచ్చె కౌగిలింత వేసంగి
ఏరొస్తుంటే వడ్డు ఆగునా
ఓ ఎదురొస్తుంటే ముద్దు ఆగునా
ఆదేలే ప్రేమా భామా ఎంత హాయి హంగామా
హెయ్యామ హెయ్యామ
హెయ్యామ హే హే హెయ్యామా (2)
నంది కొండమీద చిందులేసె జాబిల్లీ
అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి
చరణం: 1
ఊగేటి నడుము ఊయాల చూసి నే జోలా పాడాలా
ఆ జోల వింటు నీ జోలికొస్తే సూరీడు నవ్వాల
ఇంతేమరి ఈడల్లరి ఓ తిమ్మిరి రి రి రి రి
ఆ తాకిడి ఈ దోపిడీ వేసేముడి డి డి డి డి
గుట్టే తెలిపే పుట్టు మచ్చరో
గుండెల్లోన దాచి ఉంచెరో
చలాకి చెల్తే గాహే నామ్ గాడి ప్రేమల్లో
నంది కొండమీద చిందులేసె జాబిల్లీ
అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి
చరణం: 2
నాజూకు నువ్వు రోజాకు పువ్వు నీ సోకు నాకివ్వు
మారాకు వేసే మారాజు ప్రేమ నాదాక రా నువ్వు
ఓ అమ్మడో నా తుమ్మెద నీ రెమ్మలో జుం జుం జుం జుం
ఓ బాలుడా గోపాలుడా నా జంటకే కం కం కం కం
ఏ బత్తాయమ్మా బంతులాటలో
జాజిమల్లి జంట పాటలో
బోలో నువ్ హమ్ బత్ కి హై జిందాబాది జన్మల్లో
నంది కొండమీద చిందులేసె జాబిల్లీ
అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి
చల్ల గాలిసోకి జిల్లుమంది సంపంగి
పిల్లదానికిచ్చె కౌగిలింత వేసంగి
ఏరోస్తుంటే వడ్డు ఆగునా
ఓ ఎదురొస్తుంటే ముద్దు ఆగునా
ఆదేలే ప్రేమా భామా ఎంత హాయి హంగామా