Super Machi (2021)
Super Machi (2021)

Super Machi (2021)

మీనమ్మా.. సాంగ్ లిరిక్స్

చిత్రం: సూపర్ మచ్చి (2021)
సంగీతం: త‌మ‌న్ ఎస్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: వేణు శ్రీరంగం, గీతా మాధురి
నటీనటులు: కళ్యాణ్ దేవ్ , రచితా రామ్
దర్శకత్వం: పులి వాసు
నిర్మాణం: రిజ్వాన్‌
విడుదల తేది: 2021

Meenamma Song Telugu Lyrics

అందాల రాక్షసిలా నన్ను దోచే పిల్లా చాలే
ముక్కు మీద కోపమున్నా ముద్దుముద్దుగుంటే చాలే
అందాల రాక్షసిలా అందమోటి ఉంటే చాలే
కొంటె కొంటె చేతలున్నా తట్టుకుంటాలే
మీనమ్మా తెచ్చే భారం నీదే చూడమ్మా
మీనమ్మా నచ్చేలాగా నువ్వే చూడమ్మా

అందునా అందాల కొమ్మ… నన్నలా మెచ్చాలోయమ్మా
అందులో రాజీ కానమ్మా… అందుకే నమ్మానోయమ్మా
చక్కని చుక్కే తేవమ్మా… చల్లగా ధీవించేయమ్మా, ఆ ఆఆ

నిన్నమొన్న లేదే అసలు… నిజమై వచ్చే నావే కలలు
దగ్గరికొస్తే ఏదో గుబులు… గుండెల్లోనే ఎగిసే అలలు
నేనా నేనా నాతో ఉండి లేనా
నీతో చేరే అయినా అయినా ఉంటే బాగుండేనా, నేనా నే నే

మీనమ్మా తప్పే నాది మన్నించేయమ్మా, ఆ ఆఆ ఆ
మీనమ్మా మనసుకన్నా అందం లేదమ్మా… ఆ ఆఆ
నీడకేం రంగుందోయమ్మ… తోడునే వీడేపోదమ్మా
రూపమే ముఖ్యం కాదమ్మా… ఆ ఆ ఆఆ
కంటికే దూరం ఉంచమ్మ… గుండెలో దాస్తా ఆ బొమ్మ
గుట్టుగా ప్రేమిస్తానమ్మా… ఆ ఆఆశానే… ఏ ఏ ఏ ఏ
చూశానే… ఆ ఆ

Super Machi Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

చూశానే చూశానే… లిరిక్స్

చిత్రం: సూపర్ మచ్చి (2021)
సంగీతం: త‌మ‌న్ ఎస్
సాహిత్యం: కెకె
గానం: రీటా త్యాగరాజన్‌
నటీనటులు: కళ్యాణ్ దేవ్ , రచితా రామ్
దర్శకత్వం: పులి వాసు
నిర్మాణం: రిజ్వాన్‌
విడుదల తేది: 2021

Chusanae Chusanae Song Telugu Lyrics

చూశానే చూశానే… కోరుకున్న పిల్లగాడు తానే
చూశానే చూశానే… చూడగానే నేలపైన లేనే
వేచి వేచి చూసే కనులు… మాని ఇంకా వేరే పనులు
రెప్పదాటి వచ్చే కలలు… చెప్పలేని హాయే అసలు
నా కన్నులే నవ్వాలిలే… కన్నీరు కారేంతలా

ఆగిపోయెనే మనసు… చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు… తీరనివ్వాలి నా కోరిక
ఆగిపోయెనే మనసు… చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు… తీరనివ్వాలి నా కోరిక

చూశానే చూశానే… కోరుకున్న పిల్లగాడు తానే
చూశానే చూశానే… చూడగానే నేలపైన లేనే
చూశానే… ఏ ఏ ఏ… చూశానే… ఏ ఏ ఏ ఏ

కళ్ళు రెండు వాలిపోయెనే… చూశాక నిన్ను నేనే
గుండె చప్పుడాగిపోయెనే… ఆ నిమిషం ఆగలేకే
నీ కోసమే వచ్చానుగా… నా ప్రేమ తెచ్చానురా
నిన్నింతగా మెచ్చానురా… నాలోనే దాచానురా
నా కన్నులే నవ్వాలిలే… కన్నీరు కారేంతలా

ఆగిపోయెనే మనసు… చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు… తీరనివ్వాలి నా కోరిక
ఆగిపోయెనే మనసు… చిన్ని గుండెకేం తెలుసు
జ్ఞాపకాలదే గొలుసు… తీరనివ్వాలి నా కోరిక

చూశానే చూశానే… కోరుకున్న పిల్లగాడు తానే
చూశానే చూశానే… చూడగానే నేలపైన లేనే
చూశానే… ఏ ఏ ఏ… చూశానే… ఏ ఏ ఏ ఏ
చూశానే… ఆ ఆ

Super Machi Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****