చిత్రం: సుప్రీమ్ (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: వేటూరి
గానం: యల్. వి.రేవంత్, చిత్ర
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 05.05.2016
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవులు తాకిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనది అందాలనిది అందగనే సందేలకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే హో
చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చెమటారని ఉక్కిరి గుంటలలో
దుమ్మెత్తే కొమ్మమీద గుమ్మల్లే కాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా
మోటిమలపై మొకమెరుపై జతకలిపే హా
తీయనిది తెరతీయనిది తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హో
అందం హిందోళం హ హః అధరం తాంబూలం హ హః
అసలే చలికాలం త తర తగిలే సుమ బాణం
వలపే హత్తుకుపోయిన కౌగిలీ అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుల్లా వీణమీద మృదులెన్నో పాడనా
చిచ్చుల్లా హాయిమీద నిదరంతా మాయగా
తోలి ఉడుకే ఒడిదుడుకై చలి చినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకు హే
ఇచ్చినది కడు నచ్చినది
రేపంటే నను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే
అందం హిందోళం హ హః అధరం తాంబూలం హ హః
అసలే చలికాలం హ హః తగిలే సుమ బాణం హ హః