చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, లక్ష్మీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాతలు: జాగర్లమూడి సుబ్బారావు, గోరంట్ల రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 1971
పల్లవి:
చిలకమ్మా పిలిచింది… గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది… చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది… కొండంత ఆశతో
చిలకమ్మ పిలిచింది… చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది… కొండంత ఆశతో
చిలకమ్మా…. పిలిచింది
గోరొంకా….. పలికింది
చరణం: 1
ఉరిమేటి మబ్బులే… చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే… చెలిమితో కలిసేది
ఉరిమేటి మబ్బులే… చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే… చెలిమితో కలిసేది
చినదాని బుగ్గలకు… సిగ్గెపుడు వచ్చేది
చినదాని బుగ్గలకు… సిగ్గెపుడు వచ్చేది
అనుకోని వలపులూ… అప్పుడే తెలిసేది
చిలకమ్మా…. పిలిచింది
గోరొంకా….. పలికింది
చరణం: 2
ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది… దానిమ్మ పువ్వు
కుఱ్ఱతనమంతా ఒలికావు… కులుకుల్లోనువ్వు
చలిగాలి వీచింది… ప్రాణాలు జివ్వని
అది గిలిగింత పెట్టితే..అనుకొంటి నువ్వని
చిలకమ్మా…. పిలిచింది
గోరొంకా….. పలికింది
చరణం: 3
ఆ కొండ ఈ కోన… కలిశాయి మంచులో
నీరెండ తోచింది… నీవున్న తావులో
ఆ కొండ ఈ కోన… కలిశాయి మంచులో
నీరెండ తోచింది… నీవున్న తావులో
ఊగింది మనపడవ… వయ్యారి కొలనులో
ఊగింది మనపడవ… వయ్యారి కొలనులో
సాగాలి మనబ్రతుకు… ఈ తీపి ఊపులో
చిలకమ్మా పిలిచింది… గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది… చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది… కొండంత ఆశతో
చిలకమ్మ పిలిచింది… చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది… కొండంత ఆశతో
చిలకమ్మా…. పిలిచింది
గోరొంకా….. పలికింది
****** ****** ******
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఒ హో హో… వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ… వై కాంట్ యు మారి
యు..నో..నో..నో..
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..నో..నో..
చరణం: 1
నడవకు నడవకు అంతజోరుగా… నడుస్తాను నీకేం?
నాకేం..హహహా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ
నడవకు నడవకు అంతజోరుగా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ
చూడకు చూడకు అంత కోరగా
నీ చూపులోని ఎరుపు నాకు కైపులాగ తోస్తుంది
నన్నేదో చేస్తుంది..అహా
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..సిల్లి..
చరణం: 2
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే… కాళ్ళబేరమూ
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే… కాళ్ళబేరమూ
ఈ రుసరుసలూ… గుసగుసలూ… ఎందుకమ్మాయి
ఈ రుసరుసలూ… గుసగుసలూ… ఎందుకమ్మాయి
ఇంక పస ఉంటే వేసుకొందం.., రోజూ లడాయి
ప్రతి రోజూ లడాయి
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
అబబబభా..
చరణం: 3
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను
నీ అంతేదో… చూసేను..ఏయ్..
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..
****** ****** ******
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను
నన్నే వలచి నా మేలు తలచి..
నన్నే వలచి నా మేలు తలచి..
లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను
చరణం: 1
తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా…
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా..
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
చరణం: 2
నీ కన్నుల వెలుగులే తారకలై… నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై… కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా…
నీ సగము మేన నేనే నివసించగా
ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
నిన్నే వలచి నీ మేలు తలచి…
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ… నీ జాబిలినీ
ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
ఆహాహా… ఆహాహా… ఆహాహహా…