Surya IPS (1991)

చిత్రం: సూర్య IPS (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
నటీనటులు: వెంకటేష్ , విజయశాంతి
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: టి. సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 05.09.1991

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

చరణం: 1
ఖర్మకాలి రావణుండు
నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ
భీష్ముడున్న కాలమందు
నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ
ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
ఓహొహొహో
ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
పొరపాటు బ్రహ్మది గాని సరిలేనిదీ అలివేణీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

చరణం: 2
అల్లసాని వారిదంత
అవకతవక టేస్టు గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ
అయ్యయ్యయ్యె
వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ
ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి
వెంటపడతారే అరెరరెరరె
ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే
ముసలాడి ముడతలకైనా
కసి రేపగలదీ కూన

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నానము నీ కీర్తినే

*********   *********   **********

చిత్రం: సూర్య IPS (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

చరణం: 1
ఏపుగ ఊగే ఒంపుల పైరూ
కోతకు సైయ్యందే హ హ హ హా
ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే
కొంగెట్టి కూసే రంగుల ఊసే
ఒంగొంగి చూసే లొంగని ఆశే
వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
ఏమూల దాచేదీ సింగారం

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

చరణం: 2
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే
పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే హొయ్
ఏకల్లే చేరి మేకైనావూ
సోకుల్లో ఊరి చెలరేగావూ
తాంబూలం తెచ్చా తడి పొడి పంచా
ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా

ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

*********   *********   **********

చిత్రం: సూర్య IPS (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
ఓ… ఓ… ఓ… ఓ…
నెలరాజా ఇటు చూడరా
నెలరాజా ఇటు చూడరా
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
తగువేళరా తగువేలరా రవితేజా

నవరోజా తెర తీయవా
నవరోజా తెర తీయవా

చరణం: 1
నీ కోసం ఆశగా నిరీక్షించె ప్రాణం
నీ చేతుల వాలగా చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా చలించింది పాదం
నీ రూపే దీపమై ప్రయాణించె జీవం
నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా
నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా
రతిరాజువై జతచేరవా
విరివానవై ననుతాకవా

నవరోజా తెర తీయవా
నవరోజా తెర తీయవా
దివితారక తవితీరగా నినుచూశా
జవనాలతో జరిపించవే జత పూజా
నెలరాజా ఇటు చూడరా
నెలరాజా ఇటు చూడరా

చరణం: 2
ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని
ఈ స్నేహం జంటగా జగాలేలుకోని
నీ కన్నుల పాపగా కలలు ఆడుకోని
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని
ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించనీ
దిగంతాల తారల కోట ప్రవేశించనీ
గతజన్మనే బ్రతికించనీ
ప్రణయాలలో శృతి పెంచనీ

నెలరాజా ఇటు చూడరా
నవరోజా తెర తీయవా
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
జవనాలతో జరిపించవే జత పూజా
నెలరాజా ఇటు చూడరా
నవరోజా తెర తీయవా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
KGF Chapter 1 Lyrics
K.G.F: Chapter 1 (2018)
error: Content is protected !!