చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని
నటీనటులు: సూర్య, సమీరా రెడ్డి , రమ్యా
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాత: వి.రవిచంద్రన్
విడుదల తేది: 14.11.2008
మొన్న కనిపించావు మయమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే
చరణం: 1
త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోక పోతానా అందగాడా
ఓ… నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలీ
పొగవోలె పరుగున వస్తా తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు వింత ఓ చెలి
మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
చరణం: 2
కడలి నీళ్లు పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటోంది ఈ వేళలో
తల వాల్చే ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేశావే పెదవికి పెదవీ దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే
నువ్వ్వు లేక నాకూ లేదు లోకమన్నది
మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
వెన్నెలా… వెన్నెలా… వెన్నెలా…
******** ******** *********
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: సుధా కృష్ణ
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా…
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా…
చరణం: 1
వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి
చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే
కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడినముడి పడుచోడి
ఎదలో చిరుమువ్వల సవ్వడి
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా…
చరణం: 2
అభిమానం అనేది మౌనం
పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం
స్వరములకే దొరకదులే
నిను కలిసిన ఈ క్షణమే
చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే
మమకారపు నివాళిలే ఇది
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా…
******** ******** *********
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: హారీస్ జయరాజ్, హరీష్ రాఘవేంద్ర, వి. వి. ప్రసన్న, దేవన్ ఏకాంబరం
నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా…
నీతో పొంగే వెల్లువా
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన…
ఓం శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యవే
నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా…
ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివర మర్మమొకటి
కల్లా కపటం కరిగిపోయి
ముసి నవ్వా బూగమెల్ల
నువ్వు నిలిచిన చోటేదో వెలయంతో పలికెను
నువ్వు నడిచే బాటంతా మంచల్లే అయ్యెనో
నాతోటి రా ఇంటివరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరో తెలియకనే
హా వెనకే నీడై పోవద్దే
ఇది కలయో నిజమో ఏ మాయో
నా మనసే నీకు వశమాయె వశమాయె
నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా…
నీతో పొంగే వెల్లువా
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన…
కంటి నిదరే దోచుకెళ్లావు
ఆశలన్ని చల్లి వెళ్లావు
నిన్ను దాటి పోతూ ఉంటే
వీచే గాలి దిశలు మారు
అగంటు నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్ని వశివాడవు ఏ నాడు
కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనుకుంటే
నా హృదయం తట్టు కోలేదే
నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా…
నీతో పొంగే వెల్లువా
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన…
ఓం శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యవే