చిత్రం: సూర్యుడు (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ
గానం: యస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్ ,
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: మేడికొండ వెంకట మురళికృష్ణ
విడుదల తేది: 1998
ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు
వయసు వేసే చిందులు
సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు
అల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడు
కలిసి సరసాలు
ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు
వయసు వేసే చిందులు
సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు
అల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడు
కలిసి సరసాలు
ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు
వయసు వేసే చిందులు
సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు
చరణం: 1
చెలియ ఒళ్లే చెరకు విల్లు
చిలిపి నవ్వే పూల ముళ్ళు
అగ్గి వయసు ఆగడాలు వేయవెపుడు వాయిదాలు
కలయిక చలువా… అడిగితే గడువా
చురుకుల చొరవా… ఉరికితే గొడవా
మొగ్గ సిగ్గు తుంచి ముచ్చట్లు తీర్చుకో
వేళపాల లేని ఈ వేట మానుకో
ఓసి ఆడతనమా బిడియం విడుమా
అదుపు వదిలి తొలి అనుభవమా
ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు
వయసు వేసే చిందులు
సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు
చరణం: 2
కన్నె వయసే కన్ను తెరిచే
నిన్ను కలిసే ఘడియ నిలిపె
వెన్న మనసే వెచ్చ పరిచే
వెన్ను నిమిరే వేళ పిలిచే
మగ దొర తనమా… మనవిని వినుమా
సొగసుల మహిమా… తెలిపిన సుఖమా
ఆలపించుకొన శృంగార కీర్తన
సాగానించుకొనా పరువాల పాలనా
ఓసి కొంటె మనసా గడుసా దురుసా
శృతులు మించినది నీ వరసా
ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు
వయసు వేసే చిందులు
సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు
అల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడు
కలిసి సరసాలు
ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు
వయసు వేసే చిందులు
సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు
******** ******* *********
చిత్రం: సూర్యుడు (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: యస్.పి. బాలు, చిత్ర
ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా
ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా
ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా
ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా
మనసులోని మాటలన్నీ మల్లెపూల
మాలగట్టి నీకు అందజేస్తున్నా
మాసిపోని మమతలన్ని నీకు సొంతమేలె
అంటూ ఒట్టు వేసి చెబుతున్నా
నీకు సొంతమౌతా అంది మౌనరాగం
ప్రాణమల్లే చూస్తా అంది ప్రేమ గీతం
ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా
చరణం: 1
గాలిపాలయేటి మల్లె జన్మ
ఈ ఆలయాన వచ్చి వాలెనమ్మా
దేవలోక పారిజాతమమ్మా
ఈ సౌరభాల సారె తెచ్చెనమ్మా
నల్ల మబ్బు చాటునున్న మెరుపైనా
చల్లగాలి తాకకుంటే కదిలేనా
వరమై రావే ఇలా మెరిసే లావణ్యమా
రుణమే తిరేదెలా పిలిచే నా పుణ్యమా
మళ్ళి మళ్ళి పుట్టుకొచ్చి ఆ రుణాన్ని
పట్టుకొచ్చి చెల్లించు కౌగిళ్లలో
ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా
ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా
చరణం: 2
నింగిలోని వాన విల్లువేనా
నా ముంగిలంత ముగ్గులైన దానా
పొంగుతున్న గంగవెల్లువైనా
ఈ శంకరయ్యా శిరసు చేరుకుందా
కొంగువెంట లాగుతుంటే నెరజాణ
జింకలాగా మారిపోదా సింగమైన
సిగలో మందారమై ఉండిపో సావాసమా
ఒడిలో చల్లారవే రగిలే సౌందర్యమా
కంటి చాటు కెంపు ఛాయా
కుంకుమల్లే మారేనయ్యా నూరేళ్ళ నీ నీడలో
ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా
ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా
మనసులోని మాటలన్నీ మల్లెపూల
మాలగట్టి నీకు అందజేస్తున్నా
మాసిపోని మమతలన్ని నీకు సొంతమేలె
అంటూ ఒట్టు వేసి చెబుతున్నా
నీకు సొంతమౌతా అంది మౌనరాగం
ప్రాణమల్లే చూస్తా అంది ప్రేమ గీతం