చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: మాడుగుల నాగ ఫణి శర్మ
గానం: సుశీల, యస్. పి. పల్లవి
నటీనటులు: నాగేశ్వరరావు, భానుచందర్, రమ్యకృష్ణ
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాతలు: సుధాకర్, కరుణాకర్
విడుదల తేది: 04.05.1989
పల్లవి:
శ్రీమత్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీహరికథాపితామహమహమ్
వందే నారాయణదాస సత్గురుమ్
శ్రీరస్తూ …శుభమస్తూ…
శ్రీరస్తు శుభమస్తు
సత్కథా లహరికి.. హరికీ ..
ఆగమల లతల కొసల విరిసినా విరికి… హరికీ
కోటి కొంగుల ముడుల పుణ్యంబు సిరికి… హరికీ
సిరికీ… హరికీ ..శ్రీరస్తు శుభమస్తు
చరణం: 1
యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్ …అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళమోహనాకారుడైన …
శ్రీకృష్ణుడీ అనేకా అనేక లీలా వినోదములలో …
రుక్మిణీ కల్యాణ సత్కథా మధురాతి మధురమైనది
అందలి నాయికామణి …ఆ రమణీ లలిత పల్లవపాణి
నీళసుందరవేణి …అందాలపూబోని …ఆ రుక్మిణి
అందాలపూబోని …ఆ రుక్మిణి …
కనులవి తెరచిన చాలు …యదునందను అందమే గ్రోలూ
కరములు కదలిన చాలు …కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు …హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే …వలపు ఓపని వెల్లువై…
చరణం: 2
అంతలో..
యదుకేశరుతో హరితో ..గిరితో మనవియ్యము
గియ్యము కూడదని …శిశుపాలుని పాలొనరితునని
తన సోదరుడాడిన మాటవిని …దిగులుగొనీ ..దిక్కెవ్వరనీ….
తలపోసి …తలపోసి తెలవారగా …తనువెల్ల తపనలో తడియారగా …
తలపోసి తలపోసి తెలవారగా …తనువెల్ల తపనలో తడియారగా …
ప్రళయమే రానున్నదనియించెను…
ప్రణయసందేశ మా స్వామీ కంపెనూ..
ఆ లలిత పల్లవపాణి …నీళసుందరవేణి …అందాలపూబోని
ఆ రుక్మిణిమణికి …శ్రీరస్తు శుభమస్తు…
శ్రీరస్తు శుభమస్తు
చరణం: 3
అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగ
శిశుపాలుని కిచ్చి వివాహము జరిపింప నిశ్చయించగా
ఆ చిన్నారి రుక్మిణి
రానన్నాడో… తానై రానున్నాడో …
ప్రభువు ఏమన్నాడో …ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున
అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ…
తిలకము దిద్దిరదే… కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముకట్టిరదే… బంగారు చేలము కట్టిరదే
బాసికముంచిరదే …నుదుటను బాసికముంచిరదే
పదములనళడిరదే …పారాణి పదములనళదిరదే …
ఇవ్విదమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ…
శిలపై అశువులుబాయు బలిపౌశువు చందమ్మున…
అందమ్మును ఆనందమును వీడి…
డెందమ్మున కుందుచుండాగా…..
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
శ్రీరుక్మిణి హృదయప్రణయాక్షరీ
అదిగో వచ్చెను వాడె …
వచ్చీ వైరుల ద్రుంచి …వరరత్న మై నిలచి
వనితా మనోరధము తీర్చీ ..రథము బూంచి
జయవెట్ట జనకోటీ …. వెడలే రుక్మిణి తోటి
అదిగో అదిగో వాడే హరి శ్రీహరి…
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా…
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః…
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు….
******* ******* *******
చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: యస్.పి. బాలు, యస్. పి. శైలజ
పల్లవి:
లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల అమ్మలాలో…
ఊ..ఊ..మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల పీటా
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామలా వొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలా వొయిలాల అమ్మలాలో
చరణం: 1
ఓ… ఇంతలేసి కళ్ళున్నఇంతి మనసు చేమంతా? ముద్దబంతా? చెప్పరాదా చిగురంత..
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు అన్నన్నా వదిలేనా.. నన్నైనా… నిన్నైనా ..
ఇంతలేసి కళ్ళున్న..ఇంతి మనసు చేమంతా? ముద్దబంతా? చెప్పరాదా చిగురంత…
ఇంతలోనే చెప్పుకుంటె కొంటె వయసు.. అన్నన్నా… వదిలేనా నన్నైనా… నిన్నైనా …
కిన్నెరల్లే కన్నె పరువం ..ఉ..ఉ.. కన్ను గీటి కవ్విస్తే ..
ఉన్న వేడి ఉప్పెనల్లే..ఏ..ఏ.. ఉరకలేసి ఊరిస్తే…
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
చరణం: 2
ఓ… గడుసు గాలి పడుచు మొగ్గ తడిమిపోతే కాయౌనా? పండౌనా? కామదేవుని పండగౌనా?
కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల? వర్జమేల? వల్లమాలిన వంకలేల?
గడుసు గాలి పడుచు మొగ్గ తడిమిపోతే కాయౌనా? పండౌనా? కామదేవుని పండగౌనా?
కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల? వర్జమేల? వల్లమాలిన వంకలేల?
ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ళ గుత్తులైతే ..కలవరించు పొద్దులన్ని..ఈ..ఈ.. కాగిపోయి కౌగిలైతే…
మూడు బురుజుల కోట.. ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి.. సరసాల మూట …
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో…
******* ******* *******
చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, మనో
పల్లవి:
మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు.. వంద వందనాలు
మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు.. వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ.. తకిట తందనాలూ
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ.. తకిట తందనాలూ
వందనాలూ.. వంద వందనాలూ
తందనాలూ.. తకిట తందనాలూ
చరణం: 1
సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్నా..
చెన్నార చిందాడ కన్నార కనులారా
సిరులిచ్చే దీవించే సింహాదిరప్పన్నా..
సిరిగజ్జలల్లాడ చెవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా..
ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా
కోదండ రామన్నా.. గోవుల్ల గోపన్నా…
కోలాటమాడుతూ కొలువూ తీరాలా..
మహారాజ రాజశ్రీ మహనీయులందరికి.. వందనాలూ వంద వందనాలూ
తందనాలూ తకిట తందనాలూ
వందనాలూ వంద వందనాలూ
******* ******* *******
చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: యస్. పి. శైలజ
పల్లవి:
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి.. హాయే…
లొలొలొలొలొ హాయి.. హాయే
చరణం: 1
ఆ..ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా
చరణం: 2
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
యాహి యాహి యాహి యాహి యాహి యాహి
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
అయ్యయయ్యో యాహి యాహి యాహి యాహి యాహి యాహి
హా హా హ హా హా.. హాహాహాహా
వామనావతరమెత్తి.. వామనావతరమెత్తి.. సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై.. రాముడివై రమణుడివై
సీతతోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
******* ******* *******
చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ
పల్లవి:
అయ్యా… రావయ్యా…
కొలిచినందుకు నిన్ను కోదండరామా
కొలిచినందుకు నిన్ను కోదండరామా
కోటిదివ్వెల పాటి కొడుకువైనావా
తలచినందుకు నిన్ను దశరథ రామా
వెండికొండలసాటి తండ్రివైనావా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
చరణం: 1
బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా
బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా
కలల పంటగా… బతుకు పండగా
కలల పంటగా… బతుకు పండగా
కల్యాణ రాముడిలా కదలి వచ్చావా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
చరణం: 2
నడిచే నడవడి ఒరవడిగా… నలుగురు పొగడగా ఓరయ్యా
నడిచే నడవడి ఒరవడిగా… నలుగురు పొగడగా ఓరయ్యా
నీతికి పేరుగా… ఖ్యాతికి మారుగా
నీతికి పేరుగా… ఖ్యాతికి మారుగా
సాకేతరాముడిలా సాగిపోవయ్యా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
చరణం: 3
ఎంతటి వాడోయ్… రామ చంద్రుడు
ఎంతటి వాడోయ్… రామ చంద్రుడు
ఆ తాటకిని చెండాడినాడోయ్… యాగమును కాపాడినా
డెంతటి వాడోయ్ రామ చంద్రుడు
ఓహో డెంతటి వాడోయ్ రామ చంద్రుడు
హొయ్ మిధిలకు వచ్చీ… రామయ్య రాముడు
శివునిల్లు విరిచీ.. రామయ్య రాముడు
ఓహో సీతను చేపట్టి.. రామయ్య రాముడు
హొయ్ హొయ్ సీతను చేపట్టి.. రామయ్య రాముడు
సీతారాముడు అయ్యేదెపుడు
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా