చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, అంజలీ దేవి,
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: పి.ఆదినారాయణరావు
విడుదల తేది: 10.05.1957
పల్లవి:
ఓం నమశ్శివాయః… సిద్ధం నమః
ఓం…
జగదీశ్వరా… పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా… పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార… ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా… పాహి సురశేఖరా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా… పాహి పరమేశ్వరా..
చరణం: 1
శంభోహరా… వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ….
శంభోహరా… వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరివరసుందరా… గౌరివరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవగంగాధరా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా… పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా… పాహి పరమేశ్వరా..
చరణం: 2
ప్రమధులు పాడా… ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప్రమధులు పాడా… ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే…
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
ఓ..ఓ..ఓ..ఓ…
ప్రమధులు పాడా… ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
****** ****** ******
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, జిక్కి
పల్లవి :
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా.. ఆ ఆ ఆ.. హాయి సఖా.. ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
లీలగా పువులు గాలికి ఊగా ఆ.. ఆ.. ఆ…
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ…..లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ.. జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం: 1
ఏమో… ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో.. మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి… వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా… జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం: 2
ఆ ఆ ఆ ఆ ఆచూడుమా చందమామ.. అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ…
ఆ ఆ ఆ.. చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా.. ఆ.. ఆ.. ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం: 3
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా….. కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవా తనియగా
చెలువము కనుగొనా.. ఆ.. ఆ.. చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనోయీ
ఆనంద నాట్యాలు సేయనోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా
****** ****** ******
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: సుశీల
పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
పిలువకురా అలుగకురా…
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా….
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..
పిలివకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
చరణం: 1
మనసున తాళి మరువనులేర…
గళమున మోడి సలుపకు రాజా….
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర…
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా…
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం: 2
ఏలినవారి కొలువుర సామీ…
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా….
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ