చిత్రం: స్వప్నలోకం (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్
నటీనటులు: జగపతిబాబు , రాశి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
నిర్మాత: యమ్. నరసింహా రావు
విడుదల తేది: 26.02.1999
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
నిను చూపినందుకు వెలుగుని…
నువు పలికినందుకు తెలుగుని…
నువు నడిచినందుకు నేలని…
నువు పీల్చినందుకు గాలిని…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
చరణం: 1
ఎదురుగ నిన్నే ఉంచినందుకు పగటిని ప్రేమిస్తున్నా…
కలలో నువ్వే వచ్చినందుకు రాత్రిని ప్రేమిస్తున్నా…
అపురూపంగ మలచినందుకు ఆ బ్రమ్హను ప్రేమిస్తున్నా…
సుకుమారంగ పెంచినందుకు కన్నోళ్ళను ప్రేమిస్తున్నా…
నిన్ను నిదుర పుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా…
నిన్ను నిదుర పుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా…
నిన్ను మేలుకొలిపినందుకు తూర్పు ను ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
చరణం: 2
సొంతం నీకె అయినందుకు అందాన్ని ప్రేమిస్తున్నా…
సాంతం నీకే వచ్చినందుకు వయసును ప్రేమిస్తున్నా…
నీ కన్నులనే పోలినందుకు మీనాలను ప్రేమిస్తున్నా…
నీ కంఠాన్ని పోలినందుకు కోయిలనూ ప్రేమిస్తున్నా…
నిన్ను తెలుసుకున్నందుకు నన్నే ప్రేమిస్తున్నా…
నిన్ను తెలుసుకున్నందుకు నన్నే ప్రేమిస్తున్నా…
నిన్ను నన్ను కలిపినందుకు ప్రేమను ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
నిను చూపినందుకు వెలుగుని…
నువు పలికినందుకు తెలుగుని…
నువు నడిచినందుకు నేలని…
నువు పీల్చినందుకు గాలిని…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…
ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…