చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: పార్థసారధి (ఈ పాటకు మాత్రమే)
సాహిత్యం: కె.విశ్వనాథ్
గానం: బాలు, సునీత
నటీనటులు: కె. విశ్వనాథ్, ఊర్వశి, శ్రీకాంత్, లయ, శివాజి, ఆముక్తమాల్యద
దర్శకత్వం: కె. విశ్వనాథ్
నిర్మాత: హెచ్. గోపాలకృష్ణ మూర్తి
విడుదల తేది: November. 2004
(సంగీతం: విద్యాసాగర్)
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చెక్కినందుకు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసినమేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా… ని ద మ గ రి స
ద ని స ద ని స ద ని స ద ని స
తీయకే…ఆఆఆఆఅ…. ఆ గడియ ఆఆఆఆఅ
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్…
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే…ఏ.. ఆ మేను…
సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించి సాగువరకూ
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు