Swati Kiranam (1992)

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: వాణీ జయరాం, కోరస్
నటీనటులు: ముమ్మట్టి, రాధికా శరత్ కుమార్, మాస్టర్ మంజునాథ్
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డా౹౹ వి. మధుసూదన రావు
విడుదల తేది: 01.01.1992

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ
ఈ కోయిలమ్మా

కొండా కోనల్లో లోయల్లో…ఆఅ…
గోదారి గంగమ్మా సాయల్లో…ఆఅ…
గోదారి గంగమ్మా సాయల్లో

నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఆ.. ఉల్లాసాలె ఊరంగా హా…
ఉంగా ఉంగా రాగంగా అహ ఉల్లాసాలె ఊరంగా అహ
ఊపిరి ఊయలలూదంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

కొండా కోనల్లో లోయల్లో…ఆఅ…
గోదారి గంగమ్మా సాయల్లో…ఆఆ…
గోదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా
చెట్టుపుట్టా నెయ్యంగా  ఆ… చెట్టాపట్టాలెయ్యంగా హా…
చెట్టుపుట్టా నెయ్యంగా అహ చెట్టాపట్టాలెయ్యంగా అహ
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో లోయల్లో…ఆఅ…
గోదారి గంగమ్మా సాయల్లో…ఓఓ…
లోయల్లో సాయల్లో లోయల్లో సాయల్లో…
ఆఆఆఆఅ…ఆఆఆఆఆ….

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా౹౹ సి. నారాయణరెడ్డి
గానం: వాణీ జయరాం, యస్.పి.శైలజ

శృతి నీవు గతి నీవు
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప

చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె
త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వాణీ జయరాం

ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా

చరణం: 1
నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆ యోగ మాయతో మురారి దివ్య పాలనం
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై
కదులును గా సదా సదా శివ
ఆనతి నీయరా హరా
ని ని స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా
అచలనాధ అర్చింతును ర
ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని
ఆనతి నీయరా

చరణం: 2
జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడర
సాష్టాంగము గ దండము చేతు ర
ఆనతి నీయరా
సానిప గమపనిపమ
గమగ పప పప
మపని పప పప
గగమ గస సస
నిసగ సస సస
సగ గస గప పమ పస నిస
గసని సగ సగ
సని సగ సగ
పగ గగ గగ
సని సగ గ
గసగ గ
పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వాణీ జయరాం, చిత్ర

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్ప వెయ్యనే లేదు ఎందుచేత ఎందుచేత
పదహారు కళలని పదిలంగా వుంచనీ
పదహారు కళలని పదిలంగా వుంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత

చరణం:1
కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబో నీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకుమకెపుడూ ప్రొద్దు గుంకదమ్మా

చరణం:2
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి
పెద్దరికం చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటూందా
ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటూందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపొయేవే కధలన్ని

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వాణీ జయరాం

స రి గ మ ప మ గ మ స రి ని రి స
ప మ గ మ స రి
స రి గ మ ప ని స ని ప మ గ మ స రి ని రి స
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రనుతి
ప్రధమ కళా శృస్టికి

చరణం: 1
పూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమ హ్రీంకారమ
గిరుల శిరసులను జారే ఝరుల నడల వడి అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే

చరణం: 2
పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవణమా
మ గ మ పా ప మ పా పా ప ప ప
నిపపప నిపపప నిపాపపమ
గ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సువర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృష్టికి అర్పించే ద్యోతలివే

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
ఏ భారతి మనసాస్మరామి ఏ భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసానమామి

చరణం: 1
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సవుల్లాసిని

చరణం: 2
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి
సకల సుకళాసమున్వేషిణి
సకల సుకళాసమున్వేషిణి సర్వ రస భావ సందీపిణి

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

శివానీ… భవానీ… శర్వాణీ…
గిరినందిని శివరంజని
భవ భంజని జననీ
గిరినందిని శివరంజని
భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ… భవానీ… శర్వాణీ…

చరణం: 1
శృంగారం తరంగించు
సౌందర్యలహరివని… ఆ….
శృంగారం తరంగించు
సౌందర్యలహరివని… ఆ….
శాంతం మూర్తీభవించు
శివానందలహరివని… ఆ…
శాంతం మూర్తీభవించు
శివానందలహరివని… ఆ…
కరుణ చిలుకు సిరినగవుల
కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల
దరిజేర్చే దారియని
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ… భవానీ… శర్వాణీ…

చరణం: 2
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
భీషణాస్త్ర కేళివనీ…
అద్భుతమౌ అతులితమౌ
లీల జూపినావనీ
గిరినందిని శివరంజని
భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ… భవానీ… శర్వాణీ…

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా౹౹ సి. నారాయణరెడ్డి
గానం: వాణీ జయరాం

తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..
తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..
నీ దోవ పొడవునా కువకువల స్వాగతం..
నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!
తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ

చరణం: 1
ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు!!
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు..
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు!!
భానుమూర్తీ..
నీ ప్రాణ కీర్తన వినీ
పలుకని..ప్రణతులని ప్రణవ శృతిని..
పాని ప్రకృతిని ప్రధమ ప్రకృతిని!!
తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..

చరణం: 2
భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు..
భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు..
పసరు పవనాలలో పసి కూన రాగాలు..
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు..
తలయుచూ..
కలిరాకు బహుపరాకులు విని..
దొరలని..దోర నగవు దొంతరనీ..
తరలనీ దారి తొలగి రాతిరిని!!
తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..
నీ దోవ పొడవునా కువకువల స్వాగతం..
నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!

*******   *******   ********

చిత్రం: స్వాతి కిరణం (1992)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వాణీ జయరాం

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే
వింధ్య విలాసిని వారహి త్రిపురాంబికే
భవతీ విధ్యాందేహి
భగవతీ సర్వార్ధ సాధికే
సత్యార్థ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

చరణం: 1
ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని
సకల కళాకాళ్యణి సుహాసిని శ్రీ రాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకిని
మాంపాహి సుగుణాల సంవర్ధిని
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే
వింధ్య విలాసిని వారహి త్రిపురాంబికే

చరణం: 2
అలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము
అలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సరసవ శోభిని సారస లోచణి వాణీ పుస్తక ధారిణి
వర్ణాలాంకృత వైభవశాలిని వర కవితా చింతామని
మాంపాహి సలోక్య సంవాహిని
మాంపాహి శ్రీ చక్ర సింహాసిని

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగునాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతీ విధ్యాందేహి
భగవతీ సర్వార్ధ సాధికే సత్యార్థ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Mahanati Savitri (Actress)
error: Content is protected !!