చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి
నటీనటులు: కమల్ హాసన్, రాధిక
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 27.03.1986
ఆ…
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
చాలా బాగా పాడుతున్నారే
ఆ… పైశడ్యం ఉఁ ఆఁ మంగలం ఆ… ఆ… ఆ…
చుడండి ఆ… ఆ…ఆ…ఆ… ఆ… ఆఁ ఆ… ఆ… ఆ… ఆ…
నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా
తానననా తానాన తదరీ… నా… ఆ…
పల్లవి:
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా హా హా ఆ ఆ ఆ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
సువ్వీ… సువ్వీ… సువ్వీ… సువ్వీ… సువ్వీ… సువ్వీ…
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
చరణం: 1
ఓహో హో హో… ఆ… హా హా… ఏ…హే హే హే…
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
గుండెలేని మనిషల్లే…
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
సువ్వీ… సువ్వీ… సువ్వీ… సువ్వీ… సువ్వీ… సువ్వీ…
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
చరణం: 2
చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు
సువ్వీ సువ్వీ సువ్వీ…
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొత్తాలయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబో
ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారమ్మా
నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్లితివేమో మన్నుతిని చాటుగా దాగితివేమో
అమ్మా మన్నుతినంగ నే చిచువును ఆకొంతినో వెద్దినో చూదు నోలు ఆఆ
వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామె కోపంరా
పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా
వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవలు ఇత్తారు ఆ బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు చెప్పు
అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
తిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారు నాన్న ఎవలమ్మా
చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను
యశోదను కానురా నిను దండించ
సత్యను కానురా నిను సాధించ
ఎవ్వరు నువ్వని ఈ ఈ … ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు
ఎవరు కానని విడిచి వెళ్లకు నన్ను విడిచి వెళ్లకు
ఆ వెళ్ళము వెళ్ళములేమ్మ
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి
మనసు పలికే, మనసు పలికే
మౌనగీతం, మౌనగీతం
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే, మమతలొలికే
స్వాతిముత్యం, స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు
ఉఁ మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
చరణం: 1
శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ
మరుల జలకాలాడనీ ఆ…
సగము మేన గిరిజనై పగలు రేయి ఒదగనీ
పగలు రేయీ ఒదగనీ ఆ…
హృదయ మేళనలో మధుర లాలనలో
హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగిపోనీ రాగ దీపం
వెలిగిపోనీ రాగ దీపం వేయి జన్మలుగా…
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
చరణం: 2
కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ ఆ…
పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి… ఓ…
లలిత యామినిలో కలల కౌముదిలో
లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోని కాలమంతా
కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా…
మనసు పలికే, మనసు పలికే
మౌనగీతం, మౌనగీతం
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే, మమతలొలికే
స్వాతిముత్యం, స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, ఎస్. పి. శైలజ
రామా కనవేమిరా (2)
శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసధులందరూపదే పదే చూడగా శ్రీ రామచంద్ర మూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా (2)
శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా
ముసిముసి నగవుల రసిక శిఖామనులు
ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు సగారిదా మని దా మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామనులు థా థకిట థక జణుథ
ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు
థకజణు థకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ దా మ ప మ స రీ గా
మా సరి ఎవరను మత్త గుణోల్వణులు ఆహా
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా…
ముందుకేగి విల్లందబొయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబొయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
ఆ… గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నర పంగవులు
తమ ఒళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాఘ్రనులు
ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
ఆ ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
అరెరరె ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహా ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
తాకిట తైయ్యకు తా దిమి తా
రామాయ రామభద్రాయా రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీదచెయ్యివేసినాడు
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యివేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్కచిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళపెళ పెళపెళ పెళపెళ పెళపెళ విరిగెను శివధనువు
కళలోలికెను సీతానవవధువు
జయ జయ రామా రఘుకుల సోమ
జయ జయ రామా రఘుకుల సోమ
దశరధ రామా ధైత్యవిరామ
దశరధ రామా ధైత్యవిరామ
జయ జయ రామా రఘుకుల సోమ
జయ జయ రామా రఘుకుల సోమ
దశరధ రామా ధైత్యవిరామ
దశరధ రామా ధైత్యవిరామ
సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే
సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే
కనగ కనగ కమనీయమే అనగ అనగ రామణీయమే
కనగ కనగ కమనీయమే అనగ అనగ రామణీయమే
సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామా నవలావణ్య సీమా ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, ఎస్. పి. శైలజ
పట్టుసీర తెస్తననీ…
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా
పట్టపగలల్లే ఓ సందమామా…
తన్ననానె నానా తానానెనానా
తన్ననానా…
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా
ఆలినయ్యేదాకా వెల్లిపోమాకా ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ ఓయ్ తోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ ఆ అబ్బా
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలు, ఎస్. పి. శైలజ
ధర్మం… శరణం గచ్ఛామి దానం… శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
ఇంతో అంతో… ఓ ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం
లేదిక మరుజన్మం లేదిక మరుజన్మం
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
తెల్ల వారితే కూడు దక్కకా పొద్దు వాలితే గూడు చిక్కకా
తెల్ల వారితే కూడు దక్కక పొద్దు వాలితే గూడు చిక్కక
బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చే అనాథలం
అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
కన్నవారికి కానివారమై
కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై
ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో
అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి… ఆ…
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
కల్యాణ రామునికి కౌసల్య లాలి
కల్యాణ రామునికి కౌసల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముఖునికి…
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
జోజో జోజో జో…
జోజో జోజో జో…
అలమేలు పతికి అన్నమయ్య లాలి
అలమేలు పతికి అన్నమయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
******* ******* ********
చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
జోజో జోజో జోజో జో…
జోజో జోజో జోజో జో…