Swayamvaram (1999)

చిత్రం: స్వయంవరం (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత
నటీనటులు: వేణు తొట్టెంపూడి
దర్శకత్వం: కె.విజయ భాస్కర్
నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్
విడుదల తేది: 22.04.1999

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా
నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరుపులా జత చేరగా రావా

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం

మంచువెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో
ఏకాంత సేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా
కళ్యాణ రాముని కౌగిట్లో వదిగిన బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం

కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా
కౌగిలింతల కాటువేయకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా

కీరవాణి రాగంలో – పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో – వనికిందొక అధరం
గాలిలోన తేలిపోవు – రాజహంసవు నీవంటా
నిన్ను తాకి పొంగిపోవు – నీలి మబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు – ప్రేమవే నీవా
మెరుపులా మైమరుపులా – జత చేరగా రావా

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం

******     *****   ******

చిత్రం: స్వయంవరం (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా
నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా
నా బాధ తెలిసి జత రావేమె లలనా
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా
లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి
నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Chanti (2004)
error: Content is protected !!