చిత్రం: తడాఖా (2013)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: టిప్పు , రంజిత్
నటీనటులు: నాగచైతన్య , తమన్నా , సునీల్ , ఆండ్రియా జారేమియా
కథ: యన్. లింగుస్వామి
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ)
నిర్మాత: బెల్లంకొండ గణేష్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 10.05.2013
నువ్వు నేను బొమ్మా బొరుసే
కలిశామంటే రంగుబరసే పదరా..
లేద్దాం లేరా కిందపడితే
చూద్దాం లేరా నింగినంటే సరదా..
కుదేద్దాం కుమ్మేద్దాం దున్నేద్దాం హో…
గుండెల్లోంచి ఆనందం తోడేద్దాం రారా సామిరంగా
ఎయ్ రా నువ్ సుబ్బరంగా
తారాజువ్వేసినట్టు లేరా నువ్ నువ్ నిబ్బరంగా
అంగరంగ వైభవంగ రంగు జల్లేలా
ఎయ్ నువ్వు నేను బొమ్మా బొరుసే
కలిశామంటే రంగుబరసే పదరా..
లేద్దాం లేరా కిందపడితే
చూద్దాం లేరా నింగినంటే సరదా..
కుదేద్దాం కుమ్మేద్దాం దున్నేద్దాం హో…
నీలో నాలో తేడాలే తోలేద్దాం హే
ఎయ్ రామ రామ రామ సీత రాముడల్లిన కోనకి
అరె అన్నయ్య కోసం అన్నీ విడిచి
లక్ష్మణుడు డెల్లెను తోడుకి
ఎయ్ రామ రామ రామ సీత రాముడల్లిన కోనకి
అరె అన్నయ్య కోసం అన్నీ విడిచి
లక్ష్మణుడు డెల్లెను తోడుకి
సాహసంలో మేమేలే రామలక్ష్మణులం
సమరం దిగినాక బలరామ కృష్ణయ్యాలం
ఒక మాట ఒక బాణం మనకున్న సిద్ధాంతం
నా గెలుపే నీదిరా నీ దిగులే నాదిరా
తెగిపోని బంధమంటే నీది నాదేరా
కలిసే కాలాన్ని తోస్తాం కలిసే భారాన్ని మొస్తాం
కలిసే కడదాక ఉంటాం కలిసే కడతేరి పోతాం
గుండేలేమో రెండు ఉన్నా చప్పుడొక్కాటేరా
అనుకోని వరమల్లే కలిసింది మన స్నేహం
అనుకున్నా విడిపోదు మన రక్త సంబంధం
ఒక ప్రాణం చేరి సగమై చేరింది అని చెబుదాం
నువ్వేమో సూర్యుడు నేనేమో చంద్రుడు
రూపాలే వేరుగాని వెన్నెలోక్కటేరా
కలిసే అడుగుల్ని వేస్తాం కలిసే పరుగుల్ని తీద్దాం
కలిసే కేరింత కొడదాం కలిసే లోకాన్ని చుడదాం
కళ్ళు మాకు నాలుగున్నా చూపు ఒక్కటేరా
నువ్వు నేను బొమ్మా బొరుసే
కలిశామంటే రంగుబరసే పదరా..
లేద్దాం లేరా కిందపడితే
చూద్దాం లేరా నింగినంటే సరదా..
కుదేద్దాం కుమ్మేద్దాం దున్నేద్దాం హో…
నీలో నాలో తేడాలే తోలేద్దాం హే
అరె జోరు జోరు జోరు జోరు జోరుమీద జాతర
ఎవడేమనుకున్నా ఎన్ననుకున్నా లేనేలేదు కాతర (2)