Tagore (2003)

చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, హరిహరన్
నటీనటులు: చిరంజీవి, జ్యోతిక, శ్రేయ శరన్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 24.09.2003

చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా వోటు
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు

మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెలు మబ్బులు జల్లుగా
ముని మాపులలో వేసేయ్ నీ వోటు
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
నీ గుండెలకే వేస్తా నా వోటు
గుడి హారతినై వేస్తా ఆ వోటు

చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా

నీ మగసిరికే వేస్తా నా వోటు
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు

చరణం: 1
అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి
ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి

నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా వోటు
నా చెమటలతో వేస్తా ఆ వోటు

చరణం: 2
నా సుకుమారం నీకో సింహాసనం గా
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా
నీ నయగారం నాకో ధనాగారం గా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
ఆ పాల పుంతని వలవేసీ వరించే
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా వోటు
నా అలసటతో వేస్తా ఆ వోటు

*********   ********  *********

చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మల్లికార్జున్ , మహాలక్ష్మి అయ్యర్

మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా

అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
ఏ.. జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా

చరణం: 1
ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా
వాలేదా ఇలా మీదా సఖీ రాధా
రారాదా దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా

చరణం: 2
ఆకలేసి సోకులన్నీ  సొమ్మసిల్లే పొద్దే కదా
సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా

అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా

*********   ********  *********

చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్. పి.బాలు

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా
మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

Previous
Shock (2006)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Laali Patalu
Chittikoona Chittikoona Song Lyrics
error: Content is protected !!