Tajmahal (1995)

చిత్రం: తాజ్ మహల్ (1995)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవి
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.05.1995

మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం
కొత్తదాహంలో వింతమోహంలో మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపో
విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం

ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి
ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని నేల తూలిపోని
వీడిపోని ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా
లోకం నువ్వంటా ఏకం కమ్మంటా
వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా
యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలో

పల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపో
మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో

వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న
కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ
ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై కలలు చిగురించెనా
శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలుదాటిన అల్లరి ప్రేమలలో

మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో
పల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం
కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం

*********   *********   *********

చిత్రం: తాజ్ మహల్ (1995)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర

కొంగు చాటు కృష్ణుడమ్మా కన్నెకెంతో ఇష్టుడమ్మా కన్నుగప్పి జారిపోయేనే
గుండె చాటు ఆశలన్ని కొల్లగొట్టి చెప్పకుండా వెళ్ళిపోయి ఈడదాగెనే
వాడ్ని కన్నెకైదులో కలిపి అట్టిపెట్టుకో వేడికౌగిలింత కంచే దాటి వెళ్లకుండా కాపుకాసుకో

ఓ… కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ… అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో
గిల్లుకొని చూసేదా
అల్లుకొని చూపేదా
పట్టపగలే వెన్నెలంటే నేడు తెలిసే హా

ఓ… కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ… అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో

ఘుమ్ ఘుమ్ గుప్పుమంటు గులాబీల తోట గుండెల్లోన పూసే ఈ పూట (2)

వేడి ఊపిరి వేణు నాధంలా పాడుతున్నదే ప్రేమ వేధంలా
లేడి చూపులే తేనె వాగుల్లా తాకుతున్నవే తీపి ఊహల్లా
చేతికందేనమ్మా, కోరస్: పురిటి చందమామ
ఎందుకందేనమ్మా, కోరస్: కన్నె సిగ్గు సీమ
పాలరాతి బొమ్మా ప్రాణమొచ్చెనమ్మా
హారతిచ్చి స్వాగతించు కౌగిలింత చేరువైన హాయివేళలో

ఓ… కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ… అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో

ఏడు రంగుల వానవిల్లల్లే ఈడు పొంగెనే కంటి విందల్లే
గుండె కోనలో స్వాతి జల్లల్లే నిండు స్నేహమే పండే వరమల్లే
సొంతమైన జాణ, కోరస్: సోయగాల వీణ
బంతిపూల మేన, కోరస్: నీకు మేము ఫ్లేమా
పైడి ప్రాయమంత కానుకిచ్చుకోన
జన్మలోన జారిపోని బ్రహ్మముడ్లు వేసినిన్ను ఏలుకుందునా

ఓ… కలగన్నది వరమైనది మనసైన వేళలో
ఓ… అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో
గిల్లుకొని చూసేదా
అల్లుకొని చూపేదా
పట్టపగలే వెన్నెలంటే నేడు తెలిసే హా

కొంగు చాటు కృష్ణుడమ్మా కన్నెకెంతో ఇష్టుడమ్మా కన్నుగప్పి జారిపోయేనే
గుండె చాటు ఆశలన్ని కొల్లగొట్టి చెప్పకుండా వెళ్ళిపోయి ఈడదాగెనే

*********   *********   *********

చిత్రం: తాజ్ మహల్ (1995)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర

పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ…
ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా హో
మల్లి పూల పల్లకి నే తెచ్చి పెట్టన
అల్లిబిల్లి ఆశలన్ని అప్పగించిన
నిన్ను మెచ్చానే మనసిచ్చానే బహు నచ్చానే

పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ
ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా

తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఉప్పొంగని సరసాల సోయగం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ దొరకదీ అరుదైన సంబరం
పదే పదే పదే తలవని మురిపాల ఈ క్షణం
ఇదే ఇదే ఇదే మొదలని గడపాలి ప్రతిక్షణం
శ్వాసలే సన్నాయిలై
ఆశలే అక్షింతాలై
మెళ్ళోన తాళి కట్టి మూడు ముళ్ళు వెయ్యనా
ఆగలేని తహ తహకి
ఒళ్ళోన వాలిపోయే ఓనమాలు నేర్పనా
ఆగలేని తపనలకి
నిన్ను మెచ్చానే మనసిచ్చానే బహు నచ్చానే
వా వా వా…

పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ…
ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా హో

హల్లో హల్లో హల్లో అంటున్నది ఊరించి శోభనం
చల్లో చల్లో చల్లో అంటున్నది ఉడికించు యవ్వనం
ఆ సరే చలో రెడీ అంటున్నది పరువాల వాలకం
చెరో సగం అయే క్షణం సుకమెంత మోహణం
కేరింతలే కవ్వింతలై
నిట్టూర్పులే సయ్యాటలై
ఇన్నాళ్లు ఎరుగని కలలను చూడనా
మెలిపడు మెళుకువతో
కమ్మని కవితలు రాయన పెదవుల మధురిమలో
నిన్ను మెచ్చాలే మనసిచ్చాలే బహు తెచ్చాలే
వా వా వా…

పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ…
ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా హో
మల్లి పూల పల్లకి నే తెచ్చి పెట్టన
అల్లిబిల్లి ఆశలన్ని అప్పగించిన
నిన్ను మెచ్చానే మనసిచ్చానే బహు నచ్చానే

పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ
ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా

error: Content is protected !!