చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.కె. ,కల్పన
నటీనటులు: మహేష్ బాబు, బిపాసా బసు, లీసారే
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జి
నిర్మాత: జయంత్ సి. పరాన్జి
విడుదల తేది: 11.01.2002
అలెబ అలెబ అలెబ బా బా అలెబ
ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ
ధగ ధగ ధగ లాడె కల్లు
నిగ నిగ నిగ లాడె వొల్లు
సల సల సల కాగె వయసు నీదే హొయ్
యేస్కోర నాతొ భెటి చెస్కోర బ్యుటి లూటి
అందంలొ నేనె నాకు సాటి హ
అలెబ అలెబ అలెబ బా బా అలెబ
ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ
కన్నె వొంపుల్లోన ఉన్నదొయ్ సుఖం..
అలెబ అలెబ అలెబ అలెబ
తడిమై చూపుల్తొ న అంగంగమూ
అలెబ అలెబ అలెబ అలెబ
ఓసి నంగనాచి ఇదేం సంగతీ
తేనె కల్ల బూచి నాతొ నా పేచీ
ఔనంటె కులికెస్థా కాదంటె కరిచేస్తా
వొడికొస్తెయ్ వెచ్చని ముద్దె ఇస్తా హొయ్
పొ పొ వొయ్ కొరకంచు నీ పొగరె చాలించు
తలకెక్కిన కైపుని కాస్త దించు
అలెబ లెబ అలెబ లెబ
అలెబ బ బ అలెబ లెబ లెబ
ఎందబ్బ రారబ్బ ఇస్తాలె లె లె గుడుంబ
కన్నె పిల్ల గుర్రం ఒకటేలె వరసా
అలెబ అలెబ అలెబ అలెబ
పడకుంటె కల్లెం మానవులె నసా
అలెబ అలెబ అలెబ అలెబ
రాతునవుతనంటె నెదానై పోనా
కలకాలం రాజ కౌగిలినై పోనా
అట్టాగ దొరసానీ చుసాగా సరదన్నీ
పలికిస్త రావె నీ తబలానీ హొయ్
అసలె నె పసిదన్నీ ఆపైన కసిదాన్నీ
నిన్నొదలను ఎమైన ఐపొనీ హ
అలెబ లెబ అలెబ లెబ
అలెబ బ బ అలెబ లెబ లెబ
అలెబ అలెబ చూపిస్త రా రా నా దెబ్బా
********* ********* *********
చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.బి.చరణ్, ఉష
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు
ఊయలల్లె ఊగే నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సెగ మాగాలమ్మ
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు
ఊయలల్లె ఊగే నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సెగ మాగాలమ్మ
చరణం: 1
గుప్పెడు గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు డొంకల్లో
రేయంత వెతికానమ్మ నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే
దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దు వద్దు వద్దు నన్ను కవ్వించొద్దు
మోమాటాలె వద్దు గిలిగింతే ముద్దు
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు
చరణం: 2
ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేనెంత కాదన్న
నీలోనే చేరిందమ్మ నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈరోజే చూస్తున్న
నా కెంతో నచ్చిందమ్మ నీ వైఖరి
చి పాడు సిగ్గన్న సూదంటూ రాయల్లే
కుచ్చెల్లు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు నీ నడుమె ముద్దు
విప్పొద్దయ్యొ నువ్వు మరి చిట్టా పద్దు
*********** *********** ***********
చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.బాలు, ప్రసన్న
చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు
చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి
మోగించెయ్ మంటవా సన్నాయి
సింగంలా దూకరా మగధీరుడా
దమ్మెంతో చూపరా పని వీరుడా
మాటల్తో చంపకే ఓ బాలికా వస్తాలే కాసుకో నీ ఓపిక
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ
వద్దనక ముద్దులతో మురిపించవా
హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో
నేను మరి తేలికగా పడిపోనల్లా
చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి
చరణం: 1
పాల పొంగు పాప తెగరువ్వకే నవ్వు
నీలి కళ్ళ చేప వలవెయ్యకే నువ్వు
గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు
మాయదారి మోహం తొణికించదా నవ్వు
ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు
విచ్చల విడి దుకాణం పెట్టెయ్యకు
హద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు
అద్దిరిపడి గుడారం దించెయ్యకు
హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో
నేను మరి తేలికగా పడిపోనల్లా
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ
వద్దనక ముద్దులతో మురిపించవా
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి
చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు
చరణం: 2
టిప్పుటాపు బావ మొహమాటమేలేదు
అప్టు డేటు గుంటే డౌటన్నదే రాదు
రాలుగాయి పిల్లా చెలగాటమే వద్దు
కాలు జారకుండా మన కుందిలే హద్దు
కష్టమనకు ఓ రయ్యో ఈ పూటకు
ఇష్టసఖిని ఇలాగే జోకొట్టకు
కూతపెరిగె నివాళే ఈ పిట్టకు
తోడుపెరుగు నివాలి నా పెట్టకు
ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ
చీరలకి సిగ్గులకి సెలవే ఇక
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో
ఇప్పుడిక తప్పదిక తొలివేడుక
ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ
చీరలకి సిగ్గులకి సెలవే ఇక
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో
ఇప్పుడిక తప్పదిక తొలివేడుక
*********** *********** ***********
చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: టిప్పు , కల్పన
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా
లక్కి సోలక్కి నిను చూశానులే
డిక్కి డీడిక్కి ఆడేశానులే
లుక్కే నీ లుక్కే ఒక్కేసిందిలే
చుక్కే ఎంచక్కా పక్కేసిందిలే
సోనా సోనా సుల్తాన ఆడేయి ముల్తానా
నిన్నే వీడి వెళ్తానా ముద్దు ఖోరి వద్ద చేరన
జీనామర్నా ఏమయిన నీదే ఈమయిన
సోకే నీకు నజరానా నాధిన్ ధిర్నా
చరణం: 1
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చడి గామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా
షాదీ మస్తానీ జల్సా చెయ్యని సూదీ సోగ్గాడ్ని ఒక చూపెయ్యనీ
మరో మచ్చారో చినా బాలురో హెరో నాహెరో ఇక నువ్వేవరో
ఆజా ఆజా నా రోజా చెయ్యాలే పూజ
తాజా తాజా కౌగిళ్ళ తపనల తకధిమిలో
లేజా లేజా లే రాజా వుందా కలేజా
ఏసా పైసా తేల్చేస్తా కాస్కో మచ్చా
చరణం: 2
హేయ్ మామా మామా మామా హేహే మామా
వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా
హల్లో హయిబుల్లో నాకల్లోకిరా
పిల్లా ఆ పిల్లా నా ఒళ్ళోకి రా
ముల్లా ఓ మల్లా నా గాల్లీకి రా
గుల్లా రసగుల్లా ఒడి బళ్ళోకి రా
గోల గోల రంగోల గోలే చెయ్యాల
గోడ దూకే నీ ఈడు ఆడమంది రాసలీల
హోల హోల వుయ్యాల వూగించెయ్యాల
వేళపాళా లేదింక వేసెయి ఈల
*********** *********** ***********
చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో
పొగరని అందరని అన్నా అది మాతృఅం నా వైజం
తెలువని కొందరు అన్నా అది నాలో మేనరిజం?
నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు
నెను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు
నెను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు
చరణం: 1
నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special
పరుగులెత్తుతు పాలు తాగడం something special
నన్ను అడిగితే నిజం చెప్పడం nothing special
అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special
లేనివాడికి ధానమివ్వడం nothing special
లేనివాడికి ధానమివ్వడం nothing special
ఉన్నవాడిని దోచుకెళ్ళడం something special
చరణం: 2
బుద్దిమంతుడి బృఆండు దక్కడం nothing special
పోకిరోదిల పేరుకెక్కడం something special
రాజ మార్గమున ముందుకెళ్ళడం nothing special
దొడ్డి దారిలో దూసుకెళ్ళడం something special
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special
బాధ కలిగినా నవ్వుతుండడం something special