చిత్రం: తలంబ్రాలు (1987)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: సుశీల, యస్.పి.బాలు
నటీనటులు: రాజశేఖర్ , జీవిత
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: యమ్.శ్యాంప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 09.11.1987
పల్లవి:
నిన్న నీవు నాకెంతో దూరం … దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం … ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో…
నిన్న నీవు నాకెంతో దూరం … దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం … ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో…
చరణం: 1
నీలాల నింగి వంగి నేల చేవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చేవిలో ఇలా అందీ
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..
నిన్న నీవు నాకెంతో దూరం … దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం … ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో… హొ
చరణం: 2
గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది
హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
ఏ వేలనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ
కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్
నిన్న నీవు నాకెంతో దూరం … దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం … ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో…
నిన్న నీవు నాకెంతో దూరం … దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం … ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
******* ******* *******
చిత్రం: తలంబ్రాలు (1986)
సంగీతం: సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: సుశీల
పల్లవి:
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది
ఆ……ఆ….ఆ….ఆ….ఆ…
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
చరణం: 1
ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు..
చెంతకు చేరదీసినాడు
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ..
తన హృదయం పరిచిందీ
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ…
తను బలియై పోతిననీ
ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం
నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం
ఆ…ఆ….ఆ….ఆ…ఆ…
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
చరణం: 2
ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు…
కామాంధులు ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు…
అబలలు బలి ఔతున్నారు
నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ…
చల్లారేదెప్పటికీ
ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు
ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ
ఆ….ఆ….ఆ….ఆ…ఆ…
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు