చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు
నటీనటులు: సుమన్, భాను చందర్, పూర్ణిమ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 1982
పల్లవి:
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..ఈ..ఈ..ఈ
చరణం: 1
ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ గమ్యం చేరేదాకా..ఆ..ఆ..ఆ..ఆ..
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
చరణం: 2
గుండె ముక్కలయిపోయి..సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కాలమే వంచించినా..ఆ..ఆ..
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
చరణం: 3
ఎదలోని రాపిడిలోన..కదలాడు నురగలపైనా
కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కలకల నవ్వులున్నాయో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్నీళ్ళు పొంగుతున్నాయో..ఓ..ఓ….
తెలిసేదెవరికీ..హ..హ ఆ దైవానికి
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం.. ఏ కడలికో నీ పయనం
తరంగిణీ..ఈ..ఓ..ఓ..ఓ..ఓ తరంగిణీ..ఈ..ఈ..ఈ
ఓ..తరంగిణి..ఓ తరంగిణి…ఓ తరంగిణి..ఓ..తరంగిణి..