Tata Manavadu (1972)

చిత్రం: తాత మనవడు (1972)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల
నటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, విజయ నిర్మల, కైకాల సత్యన్నారాయణ, రాజ సులోచన, రాజబాబు, చంద్రమోహన్,  శ్రీవిద్య, చంద్రకళ, రమాప్రభ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు (తొలి సినిమా)
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 23.03.1972

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందం
నెలవంక పెరిగితే నింగికే ఒక అందం
చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు
చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు
తనకోసం విలపించే తనయుడొక్కడు చాలు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే…
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
తనకు తాను సుఖపడితే తప్పుగాకున్న
తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

తండ్రిమాటకై అడవికి తరలిపోయె రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు
తల్లి చరను విడిపించగ తలపడే ఆ గరుడుడు
అందుకె ఆ పక్షి ఇంద్రుడు అంతటి మహనీయుడు
ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి
ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి
భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి
ధ్రువతారగ వెలగాలి

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే…
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

******   ******   *******

*****  *****   ******

చిత్రం: తాతా మనవడు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సుంకర సత్యనారాయణ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు

పల్లవి:
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది   

చరణం: 1
పెంచేదెట్లా గంపెడుమంద..
పెట్టలేక మనపని గోవింద.. పెట్టలేక మనపని గోవింద
కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..
కాకుంటె ఇంకొక్కరు.. కాకుంటె ఇంకొక్కరూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

చరణం: 2
కాదు.. కాదు.. కాదు…. వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. కనవలసిందే ఎందరైనా
బుద్దుడో.. జవహరో..  గాంధీజీ.. కాకూడదా ఇందెవడైనా
ఔతారౌతారౌతారు.. బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
ఔతారౌతారౌతారు.. బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
లౌతారౌతారౌతారు..  తిండికి గుడ్డకు కరువై.. కడుపుమండి విషంతిని చస్తారూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

చరణం: 3
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
దారి చూపు నందరికీ వాడే.. దారి చూపు నందరికీ వాడే
నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ

ఎవరికివారే ఇట్లనుకుంటే..  ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం..  ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే మిత సంతానం.. కావాలిది అందరికి ఆదర్శం

అయ్యా..  అయ్యా.. ఎందుకు గొయ్య.. నాకొక పీడర మీతాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య

బాబూ..  బాబూ..  నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . ఒకటేగా?

******   ******   *******

చిత్రం:  తాతా మనవడు (1973)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం:  వి.రామకృష్ణ

పల్లవి:
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం 

చరణం: 1
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?

కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ
అది కాలుతున్నా వెలుగులే – కావాలి అందరికీ. . అందరికీ     

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం: 2
కొడుకంటూ నీకూ వొకడున్నాడూ – వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ
నిన్ను కడసారైనా చూడరాలేదూ – వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ – ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం: 3
కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా?  . . చితిమంటల చిటపటలు వినిపించేనా? 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Pavitra Prema (1998)
error: Content is protected !!