చిత్రం: టాక్సీ రాముడు (1981)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం: ఘంటసాల, పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, దేవిక, గిరిజ
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాతలు: డి.వి.కె.రాజు, కె.యస్. రాజు, కె.రామచంద్ర రాజు, సి.యస్. రాజు
విడుదల తేది: 18.10.1981
రావోయి…
రావోయి మనసైన రాజా
రావోయి మనసైన రాజా
ఎవరో బాల నను కోరు అందాల బాల
అనువైన అనురాగ మాల
ఎవరో బాల
చిరుగాలి తేలే రేరాణిని
కలలేల జాలే నీ రాణిని
కలలేల జాలే నీ రాణిని
రేరాణి నిగనిగ రేరాజుదే
నా రాణి వగలెల్ల నాకోసమే
నా రాణి వగలెల్ల నాకోసమే
మనసైన రాజా
అందాల బాల
మనసారా దరిచేరి మురిపించవా…
రావోయి రాజా
రావోయి మనసైన రాజా
రావోయి మనసైన రాజా
రావోయి రాజా
గగనాన తార జగమేలగా
నీ వాలు కనులు నన్నేలుగా
నీ వాలు కనులు నన్నేలుగా
నిన్నేలు వాలు కన్ను నీటైనదే
కవ్వించు కన్నె నవ్వు నిండైనదే
కవ్వించు కన్నె నవ్వు నిండైనదే
నగుమోము దాన
వగలేలనోయి
వగలైన వలపైన నీ మీదనే…
రావోయి రాజా
ఎవరో బాల